Akash Puri: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి పెళ్లి అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అతడు ప్రేమ వివాహం చేసుకుంటున్నాడట. ఆకాష్ పూరి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టాడు. చిరుత డెబ్యూ మూవీ. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, ధోని చిత్రాల్లో చైల్డ్ రోల్స్ చేశాడు. ఆంధ్రా పోరి మూవీతో హీరోగా మారాడు. ఆకాష్ ని హీరోగా నిలబెట్టాలని డైరెక్టర్ పూరి గట్టి ప్రయత్నాలే చేశాడు.
ఆయన దర్శకత్వంలో మెహబూబా చిత్రం చేశాడు. బోర్డర్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి పూరి నిర్మాత కూడాను. అంచనాల మధ్య విడుదలైన మెహబూబా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తర్వాత రొమాంటిక్, చోర్ బజార్ చిత్రాల్లో నటించాడు. రొమాంటిక్ చిత్రంలో రెచ్చిపోయి కేతిక శర్మతో రొమాన్స్ చేశాడు. అయితే హిట్ మాత్రం దక్కలేదు. దాంతో హీరోగా గ్యాప్ తీసుకున్నాడు.
26 ఏళ్ల ఆకాష్ పెళ్లికి సిద్ధం అవుతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆకాష్ ఒక సీనియర్ పొలిటీషియన్ మనవరాలితో ప్రేమలో పడ్డారట. అమ్మాయి కోటీశ్వరురాలట. ఆమె కూడా ఆకాష్ ని విపరీతంగా ఇష్టపడుతుందట. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకున్నారట. పెళ్లికి ఎస్ చెప్పారట. కాబట్టి త్వరలో ఆకాష్ పెళ్లి ప్రకటన చేయబోతున్నాడని అంటున్నారు.
మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఇక పూరి విషయానికి వస్తే… ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫార్మ్ లోకి వచ్చాడు. లైగర్ రిజల్ట్ తో మరలా క్రింద పడ్డాడు. మొదలుపెట్టిన జనగణమన ఆగిపోయింది. లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ గొడవలు చేశారు. ప్రస్తుతం రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ కి ఇదే చివరి ఛాన్స్. ఈ మూవీ ఫెయిల్ అయితే… టైర్ టు హీరోలు కూడా పట్టించుకోరు..
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Puri jagannadh son akashs wedding who is the bride
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com