Puri Jagannadh: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం జిమ్‌లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. పునీత్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది. వేలాది సంఖ్యలో ఆయన అభిమానులు ఆసుపత్రికి చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇక కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.
పునీత్ రాజ్‌కుమార్‌ను ఆయన అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుస్తారు. కాగా పునీత్ మొదటి సినిమా ” అప్పు ” ను తెరకెక్కించింది మన తెలుగు దర్శకుడు పూరి జగన్నాధ్. గుండెపోటుతో పునీత్ హాఠాన్మరణం చెందడంతో ఆయనతో తనకున్న అనుబంధాన్ని పూరి జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు. ఎవరి మరణం ఎప్పుడొస్తుందో ఊహించలేం… అని నాకు తెలుసు కానీ, పునీత్ రాజ్ కుమార్ మరణవార్త షాక్ కి గురి చేసింది. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. నాకు పునీత్ చాలా క్లోజ్. తన మొదటి సినిమా ‘అప్పు’ నేనే డైరెక్ట్ చేశాను. నాకు ఆ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. బేసిగ్గా పునీత్ చాలా మంచోడు. ఎంతోమందిని ఆదుకున్నాడు. ఎంతోమందికి సాయం చేశాడు. అటువంటి మనిషి దూరం కావడం… నేను జీర్ణించుకోలేకపోతున్నాను” అని అన్నారు.
Gone too soon ..
Can’t believe that @PuneethRajkumar is no more 💔
We will miss u .. #RIP #puneethrajkumar 💔 pic.twitter.com/SWbAHfIQ1T— Charmme Kaur (@Charmmeofficial) October 29, 2021
అతడిది చాలా చిన్న వయసు, నెల క్రితమే ఇద్దరం మాట్లాడుకున్నాం… సరదాగా కలుద్దామని అనుకున్నాం. ఈలోపు ఇలా జరిగింది అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. పునీత్ మరణం వాళ్ల కుటుంబానికి, అభిమానులకు మాత్రమే కాదు… కన్నడ పరిశ్రమకు పెద్ద లోటు అని పూరి జగన్నాథ్ చెప్పారు.