https://oktelugu.com/

Serial Heroines: ఈ సీరియల్ హీరోయిన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు.. అసలు ఎక్కడ ఉన్నారు?

Serial Heroines: సాధారణంగా హీరోయిన్స్ కేవలం వెండితెరపై మాత్రమే ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. కానీ బుల్లితెర పై పలువురు హీరోయిన్స్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటారు. బుల్లితెర సీరియల్ హీరోయిన్స్ కు విశేష మహిళా ప్రేక్షకాదరణ ఉంటుందని చెప్పవచ్చు. ఇలా బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియళ్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇలా ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన పలువురు సీరియల్ హీరోయిన్స్ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 30, 2021 / 11:16 AM IST
    Follow us on

    Serial Heroines: సాధారణంగా హీరోయిన్స్ కేవలం వెండితెరపై మాత్రమే ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. కానీ బుల్లితెర పై పలువురు హీరోయిన్స్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటారు. బుల్లితెర సీరియల్ హీరోయిన్స్ కు విశేష మహిళా ప్రేక్షకాదరణ ఉంటుందని చెప్పవచ్చు. ఇలా బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియళ్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇలా ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన పలువురు సీరియల్ హీరోయిన్స్ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్నారు. మరి ఈ హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే…

    సినీ దర్శకుడు వంశీ దర్శకత్వంలో ఈటీవీలో ప్రసారమవుతున్న చిత్రం లేడీ డిటెక్టివ్. ఈ సీరియల్ ద్వారా నటి ఉత్తర బుల్లి తెరకు పరిచయమయ్యారు.ఈ సీరియల్స్ ద్వారా ఎంతో ప్రజాదరణ సంపాదించుకున్న ఉత్తర సీరియల్స్ లో నటించకుండా ఈమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ సీరియల్ తర్వాత ఈటీవీలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ స్నేహ. ఈ సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయమైన నటి కావేరి ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. అయితే ఈ సీరియల్ తర్వాత కావేరి ఒక బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని పూర్తిగా తన వైవాహిక జీవితానికి పరిమితమయ్యారు.

    ఈటీవీలో ప్రసారమైన అన్వేషిత సీరియల్ కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన అచ్యుత్, యమునాఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు ఈ సీరియల్ కు సంబంధించి వివిధ భాగాలలో ఏకంగా 8 నంది అవార్డులను అందుకున్నారు.అంతరంగాలు సీరియల్ ద్వారా బుల్లితెర పరిచయమైన నటి కల్పన ఈ సీరియల్ తో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ తర్వాత ఈమె పలు సీరియల్స్ చేసినప్పటికీ వివాహం అనంతరం పూర్తిగా బుల్లితెరకు వెండితెరకు దూరమయ్యారు. ఇక ఎండమావులు సీరియల్ ద్వారా మహర్షి,జ్యోతి రెడ్డి ఎంత ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం మహర్షి సినిమాలతో బిజీగా ఉండగా జ్యోతి రెడ్డి కూడా పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.