Mehreen Pirzada: ‘బబ్లీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా’ హీరోయిన్ గా వస్తోన్న ‘మంచి రోజులొచ్చాయి’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఈ సందర్భంగా నిన్న ఆడియో ఫంక్షన్ ను నిర్వహించింది సినిమా బృందం. అయితే, దర్శకుడు మారుతి మెహ్రీన్ గురించి మాట్లాడుతూ.. ఆమె తనకు ఫోన్ చేసి మరీ ఈ సినిమాలో యాక్ట్ చేస్తానని కోరిందని చెప్పుకొచ్చాడు. నిజానికి సంతోష్ శోభన్ చాలా చిన్న హీరో.

కానీ మెహ్రీన్ మీడియం రేంజ్ హీరోయిన్. ఒకసారి చిన్న హీరోతో రొమాన్స్ చేసాకా, ఆమె కూడా చిన్న హీరోల హీరోయిన్ అయిపోతుంది. ఇక పెద్ద హీరోలు ఆమెకు ఛాన్స్ ఇవ్వరు. అలాగే మీడియం రేంజ్ హీరోలు కూడా ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు. మరి ఇదంతా మెహ్రీన్ కి తెలియదా ? తెలిసి తెలిసి ఒక చిన్న సినిమాలో యాక్ట్ చేస్తాను ఎందుకు కోరుకుంది ?
అవకాశాలు రాకే, ఈ విధంగా కోరిందా ? ఈ సినిమాకి మారుతి దర్శకుడు, యువీ కాన్సెప్ట్స్- మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. అందుకే, మెహ్రీన్ ఈ సినిమా పై ఆసక్తి చూపించిందా ?. అయితే ఇవేవి కారణాలు కాదు. ఆమె ఈ సినిమా ఒప్పుకోవడానికి మరో కారణం ఉందని తెలుస్తోంది. తన నిశ్చితార్థం రద్దు అవుతున్న సమయం అట అది.
బిష్ణు తనకు బ్రేకప్ చెప్పేసిన తర్వాత చాలా లోన్లీ గా ఫీల్ అయింది మెహరీన్. అంతా సడెన్ గా జరిగేసరికి ఆమెకు ఏమీ అర్ధం కాలేదట. దాంతో ఇక చేసేదేం లేక మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని అనుకుంది. అయితే, మెహ్రీన్ లో గ్లామర్ తగ్గడం, అలాగే పేస్ కూడా మునుపటిలా బబ్లీగా లేకపోవడం మొత్తానికి ఆమెకు ఛాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.
Also Read: Pawan Kalyan: ప్చ్.. పవన్ లో రైటర్ నిద్ర లేచాడు !
ఈ క్రమంలోనే మెహ్రీన్ ఈ సినిమా చేస్తాను అంటూ మారుతికి ఫోన్ చేసింది. నిశ్చితార్థం రద్దు అయినా బాధలో ఈ చిన్న సినిమాకు ఒప్పుకుంది. తన పెళ్లి వ్యవహారం పై మల్లగుల్లాలు పడుతూ నలిగిపోతున్న సమయంలో రిలీఫ్ కోసం ఈ సినిమా ఒప్పుకుంది. అయితే, ఈ సినిమా చేసాక, ఆమెకు ఇండస్ట్రీ నుంచి అన్నీ చిన్న సినిమాలే వస్తున్నాయట. మొత్తమ్మీద మెహ్రీన్ కెరీర్ కు ఇది పెద్ద లాసే.
Also Read: Niharika: మెగా బ్రదర్ నాగబాబు పుట్టిన రోజు కానుకగా… అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన నిహరిక