https://oktelugu.com/

‘జనగణమన’పై పూరి క్లారిటీ

వరుస ఫ్లాపుల అనంతరం ‘ఇస్మార్ట్ శంక‌ర్’ చిత్రంతో భారీ విజ‌యం ఖాతాలో వేసుకున్నాడు తెలుగు అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ‘ఫైటర్’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్‌ యువ నటి అనన్యా పాండే హీరోయిన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ముంబైలో శరవేగంగా […]

Written By:
  • admin
  • , Updated On : June 25, 2020 / 03:30 PM IST
    Follow us on


    వరుస ఫ్లాపుల అనంతరం ‘ఇస్మార్ట్ శంక‌ర్’ చిత్రంతో భారీ విజ‌యం ఖాతాలో వేసుకున్నాడు తెలుగు అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ‘ఫైటర్’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్‌ యువ నటి అనన్యా పాండే హీరోయిన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ముంబైలో శరవేగంగా జరుగుతున్న షూటింగ్‌ కు కరోనా వైరస్‌ బ్రేక్‌ వేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన పూరి ఈ మూవీతో పాటు ఫ్యూచర్లో చేయబోయే ప్రాజెక్టుల కథ, కథనాలపై దృష్టి పెట్టాడు. చాలా వేగంగా స్క్రిప్ట్ వర్క్‌ పూర్తి చేసే పూరి.. ఈ విరామంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జ‌న‌గ‌ణ‌మ‌న’పై కూడా దృష్టి పెట్టాడు.

    కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

    మహేష్‌బాబు హీరోగా ఈ సినిమా తీయనున్నట్లు గతంలోనే పూరి జగన్నాథ్‌ ప్రకటించాడు. కానీ, ఏళ్లు గడిచినా ఈ మూవీ పట్టాలెక్కలేదు. దాంతో పూరి చిత్రాన్ని పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. కానీ, వాటిని స్టార్ డైరెక్టర్ ఖండించాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేశాడు.అందేకాదు దీన్ని పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తానని చెప్పాడు. దీంతో పూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ విరామంలో ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను పూరి పూర్తి చేశాడట. స్క్రిప్టు అద్భుతంగా వ‌చ్చింద‌ని స‌మాచారం. అయితే ఈ సినిమాను ఏ హీరోతో చేయబోతున్నది పూరి జగన్నాథ్‌ వెల్లడించలేదు. త్వరలో ఈ సస్పెన్స్‌ వీడనున్నట్లు సమాచారం.