
తెలుగు నాట సీనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఓ శక్తి అని ఆయన అభిమానులు భవిష్యత్తులో అందరికీ చెప్పాల్సిన పరిస్థితి రావొచ్చేమో. వచ్చే తరానికి ఆ ఎన్టీఆర్ గురించి పేరు తప్ప ఏమీ తెలియదు. పోనీ ఈ తరం ఎన్టీఆర్ ఉన్నాడు కదా అనుకుంటే.. సినిమాల పరంగా ఈ ఎన్టీఆర్ ని ఆ ఎన్టీఆర్ తో పోల్చి చూడలేం. కనీసం భవిష్యత్తులోనైన పోల్చుకున్నే ధైర్యమైనా చెయ్యొచ్చా అంటే అనుమానమే. అయితే సీనియర్ ఎన్టీఆర్ కి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగు సినిమా రంగంలో తాత పేరును పెంచకపోయినా నిలబెట్టిన మాట వాస్తవం. కానీ రోజురోజుకు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం పై అనేక రూమర్స్ వస్తున్నాయి. తారక్ ఇంకా సినిమాల్లో చేయాల్సింది సాధించాల్సింది చాలా ఉందనేది చాలామంది చెప్పే రొటీన్ డైలాగ్. ఇలాంటి టైంలో రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఈ మధ్య తెలుగు తమ్ముళ్లతో పాటు టీడీపీ సానుభూతి పరులు కూడా ఎన్టీఆర్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం బలంగా చేస్తున్నారు.
వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం
కానీ తారక్ సినిమాల గురించి తప్ప ఇంకోటి ఆలోచించట్లేదు అని ఆయన సన్నిహితుల నుండి వివరణలు వినిపిస్తున్నాయి. అయితే తారక్ మాత్రం నేటి రాజకీయం పై తన భావవ్యక్తీకరణ కోసమైనా ఈ మధ్య స్పందించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ దారుణమైన ఓటమిని కూడగట్టుకున్నాక కూడా తారక్ రాజకీయాలు గురించి ఏమి మాట్లాడలేదు. అంతటి దారుణమైన ఓటమినుండి పార్టీని బలోపేతం చేయాలనీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నా.. తారక్ మాత్రం పార్టీకి నైతిక సహాయసహకారాలు కూడా అందించడం లేదనేది టీడీపీ నాయకుల ఆరోపణలు. మొత్తానికి గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్ రాజకీయ రూమర్స్ కి, సినిమా విశేషాలకు మధ్య వారధిగా మారిపోయాడు. ఇప్పటికైనా తనకు ఏ రాజకీయ రంగు లేదని తారక్ నిరూపించుకుంటే అది ఆయన సినిమాల కలెక్షన్స్ కే కలిసొస్తుంది. మరి ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తాడా !