https://oktelugu.com/

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

అరిగిపోయిన బీసీ కార్డును ఇంకా రుద్దుతూనే ఉన్నాడు నారా లోకేష్. అచ్చెన్నాయడు అరెస్ట్ జరిగిన నాటి నుండి ఆయన కులం అనే ఆయుధంతో పోరాటం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ డీపితో పాటు, చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్ డీపీలుగా అచ్చెన్నాయుడు ఫోటో పెట్టుకున్నారు. అలాగే ‘వి స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు’ అనే ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. బీసీ నాయకుడు అచ్చెన్న పై కక్ష పూరిత అరెస్ట్ లకు పాల్పడితే వైసీపీలోని బీసీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 25, 2020 / 03:17 PM IST
    Follow us on


    అరిగిపోయిన బీసీ కార్డును ఇంకా రుద్దుతూనే ఉన్నాడు నారా లోకేష్. అచ్చెన్నాయడు అరెస్ట్ జరిగిన నాటి నుండి ఆయన కులం అనే ఆయుధంతో పోరాటం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ డీపితో పాటు, చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్ డీపీలుగా అచ్చెన్నాయుడు ఫోటో పెట్టుకున్నారు. అలాగే ‘వి స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు’ అనే ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. బీసీ నాయకుడు అచ్చెన్న పై కక్ష పూరిత అరెస్ట్ లకు పాల్పడితే వైసీపీలోని బీసీ నాయకులు ఏమి చేస్తున్నారని..ఆయన ప్రశ్నిస్తున్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగిన నాటి నుండి వస్తున్న ఆరోపణలు, వాటిపైన అసలు నిజాలు పక్కన పెట్టి బీసీ నాయకుల అణచివేత అనే కార్డు పట్టుకు తిరుగుతున్నారు లోకేష్.

    కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

    అచ్చెన్నాయుడిది అక్రమ అరెస్ట్ అని ఆయన నిరూపించేలా గట్టి ఆధారాలతో అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తే.. ఏమైనా ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా ఈ కులవాద రాజకీయం వలన లోకేష్ కి క్రెడిట్ రాకపోగా, ఇమేజ్ డామేజ్ అవుతుంది. అవినీతి ఆరోపణలను కులరాజకీయాలతో ఎదుర్కొవాలనుకోవడం అవివేకం అవుతుంది. ఓ పక్క స్ఫష్టమైన ఆధారాలతోనే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు చెవుతుంటే లోకేష్ మాత్రం అచ్చెన్నాయుడిని వెనకేసుకొని వస్తున్నాడు. ఏ పార్టీ నాయకుడిపై అవినీతి ఆరోపణలు వచ్చినా లేదా అరెస్ట్ లు జరిగినా, సదరు పార్టీకి చెందిన నాయకులు ఆరోపణలు ఖండించి, ఆ నాయకుడిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి యొక్క గత చరిత్ర, చిత్త శుద్ధి వంటివి ప్రమాణంగా… అతన్ని కాపాడే ప్రయత్నం జరగాలి. కానీ లోకేష్ బాబు మాత్రం అచ్చెన్నాయుడు విషయంలో కులం కార్డుతో మాత్రమే కాపాడాలని అనుకుంటున్నాడు.

    గవర్నర్ కు లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్న అంశాలివే..!

    వైసీపీలోని బీసీ నాయకులెవ్వరూ…అచ్చెన్నాయుడు అరెస్ట్ ని ప్రశ్నించరా అని లోకేష్ సోషల్ మీడియా వేదికగా అడగడం ఆయన కుల రాజకీయం ఏస్థాయికి చేరిందో అర్థం అవుతుంది. ఆయన ద్రుష్టిలో అచ్చెన్నాయుడు బీసీ కనుక, అవినీతికి పాల్పడినా… కాపాడుకోవాల్సిన బాధ్యత అన్నీ పార్టీల బీసీ నాయకులకు ఉంది అన్నట్లుగా ఉంది. ఒక వేళ అచ్చెన్నాయుడు నిజంగా ఎటువంటి అవినీతికి పాల్పపడకుంటే..ఆయన నిర్దోషిగా బయటపడతారు. తనపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత తీసుకొని న్యాయపోరాటం చేస్తే గౌరవంగా ఉంటుంది. అలా కాకుండా ఇలా కుల ప్రస్తావనతో అవినీతి ఆరోపణలకు అడ్డుకట్ట వేయాలని చూస్తే అభాసుపాలు కావాల్సివస్తుంది.