Purandheswari : అతడితో హద్దు దాటలేదు.. పెళ్లికి ముందే వెళ్లిపోమన్నారు… ప్రేమపెళ్లిపై పురంధేశ్వరి బయటపెట్టిన నిజాలు

అయితే ఈమె 1959 వ సంవత్సరం లో పుట్టారు. అలాగే ఈమె 1979 వ సంవత్సరంలో ఎంబిబిఎస్ డాక్టర్ అయిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారిని పెళ్లి చేసుకున్నారు.

Written By: NARESH, Updated On : October 22, 2023 4:29 pm
Follow us on

Purandheswari : విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ తారక రామారావు గారికి 13 మంది పిల్లలు ఉన్నారు.ఇలాంటి క్రమంలో అందులో నందమూరి హరికృష్ణ,బాలకృష్ణ లాంటి హీరోలు మనకు సినిమాల ద్వారా పరిచయమయ్యారు. ఇక మిగిలిన ఎన్టీయార్ సంతానం ఎవరు కూడా మనకు అంత పెద్దగా పరిచయం లేనప్పటికీ వాళ్ల కూతుర్లలో చంద్రబాబు నాయుడు భార్య అయిన భువనేశ్వరి గారు అలాగే మాజీ మంత్రి అయిన పురందేశ్వరి గారు ఈ ఇద్దరు మాత్రమే ఎక్కువ మందికి తెలుసు ఇక ప్రస్తుతం పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలుగా కొనసాగుతుంది.

అయితే ఈమె 1959 వ సంవత్సరం లో పుట్టారు. అలాగే ఈమె 1979 వ సంవత్సరంలో ఎంబిబిఎస్ డాక్టర్ అయిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారిని పెళ్లి చేసుకున్నారు.ఈమె చదువు అంత చెన్నై లోనే సాగింది…ఇక ఇదే క్రమంలో ఈమె పెళ్లి  మీద చాలా రోజు నుంచి చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్లది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఆమె పెళ్లి మీద రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఈమె రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఈమె పెళ్లి గురించి ప్రస్తావన రావడం జరిగింది.

దాంతో ఆమె స్పందిస్తూ నా భర్త వెంకటేశ్వరరావు గారు మా వదిన వాళ్ళ తమ్ముడు కావడంతో ఆయనతో వివాహం చేయాలని మా ఇంట్లో వాళ్ళు చాలాసార్లు అనుకునేవారు దానివల్ల ఆయన గురించి నేను ఎక్కువగా ఆలోచించాను… ఇక ఇలాంటి క్రమంలో మా ఇంట్లో వాళ్ళు ఆయనకి నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే అంతే తప్ప నేను ఎప్పుడూ హద్దులు దాటి బిహేవ్ చేసింది అయితే లేదు…

అయితే ఒకానొక టైం లో మా తాతయ్య నీకు డాక్టర్ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకో అంటూ కామెంట్లు చేశాడు అంటు
ఆమె ఆ విషయం చెప్పుకుంటూ ప్రస్తుతం నవ్వుకుంది. అయితే కంప్లీట్ గా మాది పెద్దలు కుదిర్చిన వివాహమే అని ఆమె కరాకండిగా చెప్పడంతో వీళ్ళ పెళ్లి ప్రేమ పెళ్లా లేక పెద్దలు కుదిరిచిన వివాహమా అనే దానిమీద ఒక క్లారిటీ అయితే వచ్చింది…ఇక పురందేశ్వరికి అన్నా, చెల్లెలు, తమ్ముళ్లు అందరూ కలిసి పదిమందికి పైనే ఉన్నారు. ఇక ఈమె ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఈమె అధ్యక్షతన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పార్టీ బలపడుతుందనే చెప్పాలి…