PS Kirthana : అమృత’ లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు అక్కినేని కుటుంబంలో కోడలు.. ఎవరో గుర్తుపట్టగలరా!

పీఎస్ కీర్తన. ఈమె మణిరత్నం తెరకెక్కించిన అద్భుతమైన దృశ్యకావ్యం 'అమృత'. పేరుకి ఈ చిత్రంలో మాధవన్, సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా నటించారు కానీ, సినిమా కథ మొత్తం కీర్తన చుట్టూనే తిరుగుతుంది

Written By: Vicky, Updated On : August 20, 2024 9:05 am

PS Kirthana

Follow us on

PS Kirthana : కొంతమంది బాలనటులు వయస్సు కి మించి అద్భుతమైన నటన కనబర్చడం చూసి అప్పుడప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాము. ఇంత చిన్న వయస్సులో ఇన్ని భావోద్వేగాలు ఎలా పండించగలరు?, దేవుడు అందరికీ ఇలాంటి వరం ఇవ్వడు అని మన మనసులో ఎన్నోసార్లు అనుకొని ఉంటాము. అలాంటి నటులు పెద్దయ్యాక పెద్ద స్టార్స్ గా ఎదిగి హీరోలుగా, హీరోయిన్లు గా ఎన్నో సూపర్ హిట్ అందుకోవడం మనం చాలామందిని చూసాము. ఉదాహరణకు మహేష్ బాబు, తరుణ్, శ్రీదేవి, కమల్ హాసన్ వంటి వారిని తీసుకోవచ్చు. వీరంతా బాలనటులుగా విశేష ఆదరణ పొందిన వాళ్ళే. అయితే కొంతమంది బాలనటులు మాత్రం కేవలం ఒక్క సినిమాకి మాత్రమే పరిమితం అవుతారు.

ఆ తర్వాత చదువు చెడిపోతుందనే ఉద్దేశ్యంగా తల్లిదండ్రులు సినీ రంగానికి దూరంగా పెంచుతూ ఉంటారు. అలా చిన్నతనం లోనే అద్భుతమైన నటన కనబర్చి, ఆ తర్వాత సినిమాలకు పూర్తి దూరమైనా ఒక అమ్మాయి గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఆ అమ్మాయి పేరు పీఎస్ కీర్తన. ఈమె మణిరత్నం తెరకెక్కించిన అద్భుతమైన దృశ్యకావ్యం ‘అమృత’. పేరుకి ఈ చిత్రంలో మాధవన్, సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా నటించారు కానీ, సినిమా కథ మొత్తం కీర్తన చుట్టూనే తిరుగుతుంది. విడిపోయిన తన తల్లిదండ్రులు మళ్ళీ కలవాలని ఈ పసి హృదయం పడే తపన, ఆరాటం, చేసే ప్రయత్నాలను డైరెక్టర్ మణిరత్నం ఎంతో అద్భుతంగా చూపించాడు. ఈ సినిమాకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. వాటిల్లో అత్యధికంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కీర్తనకే వచ్చింది. ఈ అమ్మాయి ఈ చిత్రం లో ఎంతో ముద్దుగా అల్లరి చేసింది, అదే సమయం లో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. ఎక్కడా కూడా డ్రామాకి తావు ఇవ్వకుండా ఎంతో సహజంగా అంత చిన్న వయస్సులో నటించడం అంటే సాధారణమైన విషయం కాదు. ఈ అమ్మాయి నేడు హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఉంటే వేరే లెవెల్ లో ఉండేది. మరో విశేషం ఏమిటంటే ఈమె తల్లిదండ్రులు మరెవరో కాదు, తమిళనాడు లో పాపులర్ నటులుగా పేరు గడించిన పార్తీబన్, సీతల ముద్దుల కూతురు.

తల్లిదండ్రులు సినీ నటులు అయ్యినప్పటికీ, తనలో అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మాయి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని అనుకోలేదు. ఉన్నత చదువులను చదువుకొని అక్కినేని కుటుంబానికి కోడలు అయ్యింది. అక్కినేని అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది అక్కినేని నాగేశ్వర రావు గారి కుటుంబం, కానీ మేము చెప్తున్నది టాలీవుడ్ అక్కినేని కాదు, తమిళం లో కూడా ప్రముఖ ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఏ శ్రీకర్ ప్రసాద్ అక్కినేని ఇంటికి కోడలిగా భార్యగా వెళ్ళింది అన్నమాట. శ్రీకర్ తండ్రి అక్కినేని సంజీవి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు తమిళం లో ఎడిటర్ గా పనిచేసాడు. ఆయన సోదరుడు మరెవరో కాదు, ఎల్వీ ప్రసాద్. ఇలా ఉన్నతమైన బ్యాక్ గ్రౌండ్ ఇమేజి ఉన్న ఫ్యామిలీ కి కీర్తన కోడలుగా వెళ్లడం విశేషం.