Prabhas – Hanu Movie : ప్రభాస్ – హను మూవీ లో కొత్త హీరోయిన్ ని తీసుకోవడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా..? చూస్తే ఆశ్చర్యపోతారు!

ప్రభాస్ తో చేయబోయే సినిమా కోసం ఆయన ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోయిన్స్ అందరినీ దూరం పెట్టి, ఇంస్టాగ్రామ్ లో సెలబ్రిటీ గా మంచి పేరు తెచ్చుకున్న ఇమాన్ ఇస్మాయిల్ ని తీసుకున్నారు. హను తన సినిమాకి హీరోయిన్ ని ఎంచుకున్నాడు అంటే, ఆయన ఎంతో పరిశోధన చేసి ఉంటే కానీ ఒప్పుకోడు. ఇమాన్ విషయం లో కూడా అదే చేసాడు.

Written By: Vicky, Updated On : August 20, 2024 9:14 am

Iman Ismail Heroine of Prabhas hanu movie

Follow us on

Prabhas – Hanu Movie : వరుసపెట్టి పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రీసెంట్ గానే కల్కి చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ ని కొల్లగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవుతున్న సమయంలోనే తన కొత్త చిత్రం ‘రాజాసాబ్’ గ్లిమ్స్ వీడియో ని అభిమానుల కోసం విడుదల చేసిన ప్రభాస్, ఇప్పుడు రీసెంట్ గా హను రాఘవపూడి తో ఒక పీరియాడికల్ లవ్ స్టోరీ ని చెయ్యబోతున్నాడు. హను సినిమాల్లో హీరో కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, హీరోయిన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ గమనిస్తే ఈ విషయం మీకు అర్థం అవుతుంది.

అందుకే ప్రభాస్ తో చేయబోయే సినిమా కోసం ఆయన ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోయిన్స్ అందరినీ దూరం పెట్టి, ఇంస్టాగ్రామ్ లో సెలబ్రిటీ గా మంచి పేరు తెచ్చుకున్న ఇమాన్ ఇస్మాయిల్ ని తీసుకున్నారు. హను తన సినిమాకి హీరోయిన్ ని ఎంచుకున్నాడు అంటే, ఆయన ఎంతో పరిశోధన చేసి ఉంటే కానీ ఒప్పుకోడు. ఇమాన్ విషయం లో కూడా అదే చేసాడు. ఈమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఒక్కసారి తెరిచి చూస్తే ఆమె ఎంత మంచి నటి అనేది అర్థం అవుతుంది. ఆమె చేసే రీల్స్ లో తన ముఖంలో ప్రతీ హావభావాలను అలవోకగా పండించడాన్ని మనం చూడొచ్చు. హను కోరుకున్న కొత్తదనం, చురుకుదనం ఆ అమ్మాయిలో కనిపించింది. అందుకే ఇంతమంది టాప్ హీరోయిన్స్ ని కాదని, ఆమెని తన సినిమా కోసం ఎంచుకున్నాడు. అంతే కాదు ఈమె డ్యాన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. కోట్లాది మంది అమ్మాయిలు ప్రభాస్ తో ఒక సెల్ఫీ దిగేందుకు పరితపిస్తూ ఉంటారు. అలాంటి అమ్మాయిలలో ఒకరైన ఇమం ఇస్మాయిల్ కి ఇలాంటి అదృష్టం దొరకడం నిజంగా ఆమెకి దేవుడు ఇచ్చిన వరం లాంటిది. ఒకవేళ ఈ సినిమా పెద్ద హిట్ అయితే ఈ అమ్మాయి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇకపోతే ఈ చిత్రం రజాకార్ ఉద్యమ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఒక ప్రేమకథ. ఈ ప్రేమకథ ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కి, ఒక పాకిస్తాన్ అమ్మాయికి మధ్య జరుగుతుంది. అంతటి మహా యుద్ధ వాతావరణం ఉన్న సమయం లో వీళ్లిద్దరు అనుకోకుండా ప్రేమలో పడడం వల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనే దానిపై హను రాఘవపూడి ఈ స్టోరీ ని రచించాడు. వింటుంటేనే ఎంతో కొత్తగా, ఆసక్తిగా ఉంది కదూ?, మరి ఇలాంటి సినిమాలను తియ్యడంలో సిద్ధహస్తుడైన హను రాఘవపూడి ఇక ఏ స్థాయిలో తియ్యబోతున్నాడో ఊహించుకోవచ్చు. ఈ ఏడాదిలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.