https://oktelugu.com/

Agent Movie : అతను చేసిన పొరపాటు వల్లే మా ‘ఏజెంట్’ చిత్రం డిజాస్టర్ అయ్యింది..నిర్మాత సంచలన వ్యాఖ్యలు

ఈ సినిమా ఫలితం పై ఆ చిత్ర నిర్మాత అనిల్ సుంకర నేడు ట్విట్టర్ లో స్పందించాడు, ఆయన మాట్లాడుతూ 'ఏజెంట్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయినందుకు మేము చాలా బాధపడుతున్నాము.

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2023 / 10:32 PM IST
    Follow us on

    Agent Movie  : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అఖిల్ తన కెరీర్ లో ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా ఇలా కనీసం రెండు మూడు రోజులు కూడా షేర్ వసూళ్లను రాబట్టలేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఈ చిత్రం నిర్మించడానికి సుమారుగా 80 కోట్ల రూపాయిల వరకు బడ్జెట్ ఖర్చు అయ్యింది.

    ఊరు పేరు తెలియని హీరో కి కూడా ఇంత భారీ బడ్జెట్ తో తీస్తే మినిమం రేంజ్ ఓపెనింగ్స్ వస్తున్న ఈరోజుల్లో అఖిల్ సినిమాకి కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రాకపోవడం గమనార్హం.దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకి ఏ రేంజ్ టాక్ వచ్చిందో అనేది. మూడు రోజులకు కలిపి ఈ చిత్రం 5 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. మొదటి రోజు 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వస్తుంది అనుకున్న ఈ సినిమాకి ఫుల్ రన్ లో కూడా అంత రావడం అసాధ్యం అని తేలిపోయింది.

    ఇక ఈ సినిమా ఫలితం పై ఆ చిత్ర నిర్మాత అనిల్ సుంకర నేడు ట్విట్టర్ లో స్పందించాడు, ఆయన మాట్లాడుతూ ‘ఏజెంట్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఇది పూర్తిగా మా తప్పే, మేము ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తామని అనుకున్నాము, కానీ సరైన బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా అలాంటివి జరగడం అసాధ్యం అనే విషయాన్నీ మాత్రం గమనించలేకపొయ్యాం, అది మా తప్పే.మేము చేసిన ఈ తప్పులకు మరియు పొరపాట్లకు క్షమాపణ లేదు, కానీ ఈ తప్పుల నుండి ఏవైతే నేర్చుకోవాలో, అవన్నీ నేర్చుకుంటాము. మా మీద నమ్మకం ఉంచిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ అనిల్ సుంకర పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సరైన బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా అంత బడ్జెట్ ఎలా పెట్టావు అంటూ నెటిజెన్స్ అనిల్ రావిపూడిని ప్రశ్నిస్తున్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లిన తప్పు ఎవరిదీ..?, డైరెక్టర్ సురేందర్ రెడ్డి దా? లేదా రచయితా వక్కంతం వంశీ దా ? అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.