Naga Chaitanya : సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే నా జీవితం ఇలా అయ్యింది అంటూ నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఆ చిత్రాలు అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. గుణపాఠాలు లాగా తీసుకుంటాను' అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు

Written By: NARESH, Updated On : May 1, 2023 10:36 pm
Follow us on

Naga Chaitanya : ప్రస్తుతం అక్కినేని లేగసీ ని సమర్ధవతం గా మోస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది అక్కినేని నాగ చైతన్య మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక పక్క నాగార్జున మరో పక్క అఖిల్, ఇద్దరికీ ఇద్దరు పోటీపడి మరీ డిజాస్టర్ ఫ్లాప్స్ ఇస్తున్న సమయంలో నాగ చైతన్య వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు.

ఆయన హీరో గా నటించిన చివరి చిత్రం ‘థాంక్యూ’ పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ, అంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ పెద్ద హిట్స్ గా నిలిచాయి.ఇప్పుడు ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ ఈ నెల 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా నాగచైతన్య వరుసగా ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నాడు.ఈ సందర్భంగా రీసెంట్ ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో, ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘నా జీవితం లో నేను ఏ విషయం లోను బాధ పడింది లేదు, ప్రతీ ప్రతికూల పరిస్థితుల నుండి ఎదో ఒకటి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను.కానీ నేను ఒక మూడు సినిమాల విషయం లో చాలా బాధపడుతున్నాను.నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఆ చిత్రాలు అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి.ఆ మూడు చిత్రాలను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను,గుణపాఠాలు లాగ తీసుకుంటాను’ అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ మూడు సినిమాలు ఏమిటి అనేది మాత్రం ఆయన చెప్పలేదు.

నాగ చైతన్య కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్స్ లిస్ట్ తీస్తే దడ, బెజవాడ మరియు థాంక్యూ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆయన తల్చుకున్నది ఈ సినిమాల గురించేనా అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు.ఇక ఆయన లేటెస్ట్ గా నటించిన ‘కస్టడీ’ చిత్రానికి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్సకత్వం వహించగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో అలరిస్తుందో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.