బీజేపీలోకి విశ్వేశ్వర్ రెడ్డి? బీజేపీ వ్యూహమేంటి?

బీజేపీ వ్యూహాలు మార్చుకుంటోంది. పశ్చిమ బెంగాల్ లో అమలు చేసిన పద్ధతిని తెలంగాణలో కూడా అవలంభించడానికి పావులు కదుపుతోంది. బెంగాల్ లో కాంగ్రెస్, కమ్యూనిస్టుకంటే వెనుకబడి ఉన్న పార్టీ అక్కడ రచించిన వ్యూహం ఫలితాన్నిచ్చింది. దీంతో అక్కడ రచించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా ఆచరణలో పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈటల రాజేందర్ చేరికకు రంగం సిద్ధమైపోతున్న తరుణంలో ఇంకా కొందరిని చేర్చుకోవాలని భావిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ మాజీ ఎంపీ […]

Written By: Srinivas, Updated On : June 4, 2021 12:24 pm
Follow us on

బీజేపీ వ్యూహాలు మార్చుకుంటోంది. పశ్చిమ బెంగాల్ లో అమలు చేసిన పద్ధతిని తెలంగాణలో కూడా అవలంభించడానికి పావులు కదుపుతోంది. బెంగాల్ లో కాంగ్రెస్, కమ్యూనిస్టుకంటే వెనుకబడి ఉన్న పార్టీ అక్కడ రచించిన వ్యూహం ఫలితాన్నిచ్చింది. దీంతో అక్కడ రచించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా ఆచరణలో పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టింది.

ఇప్పటికే ఈటల రాజేందర్ చేరికకు రంగం సిద్ధమైపోతున్న తరుణంలో ఇంకా కొందరిని చేర్చుకోవాలని భావిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తున్నారు. టీఆర్ఎస్ కు చెక్ పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ వ్యతిరేకులను పార్టీలో చేర్చుకుని వారి ద్వారా పోరాటం సాగించాలని పథకం వేస్తోంది. ఇందుకగుణంగా ముఖ్య నేతల్ని రంగంలోకి దింపింది.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2013లో టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం ఎంపీగా గెలిచారు. కేసీఆర్ తో పొసగక పార్టీ నుంచి 2018లో బయటకు వచ్చారు. దీంతో బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతోంది. ఈటల, విశ్వేశ్వర్ రెడ్డిలతో రాజకీయంగా నిలదొక్కుకోవాలని భావిస్తోంది.తెలంగాణలో టీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి అనువైన మార్గాలు వెతుకుతోంది.

అయితే విశ్వేశ్వర్ రెడ్డి ఓ షరతు విధించినట్లు తెలుస్తోంది. ఒక వేళ బీజేపీ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో దోస్తీ కడితే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి బీజేపీ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తో పొత్తు ఉంటే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అందుకే ఈటల పార్టీలో చేరుతున్నారని పేర్కొంది. దీంతో విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.