Anil Ravipudi Producer controversy: అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగాడు. 9 సినిమాలు చేస్తే అందులో 9 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆయన టాప్ డైరెక్టర్ అంటూ చాలామంది ప్రొడ్యూసర్లు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రీసెంట్ గా ఆయన చిరంజీవితో చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమాతో ఆయన మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి కెరియర్ స్టార్టింగ్ లో సినిమాలు చేస్తున్న క్రమంలో ఒక ప్రొడ్యూసర్ తనకి అడ్వాన్స్ గా కొంత అమౌంట్ ని చెక్ రూపంలో ఇచ్చారట. ఇక మరికొద్ది రోజులకి ఆ అడ్వాన్స్ ను వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు అంటే ఆయన ఒక తమిళ్ ప్రొడ్యూసర్ గా తెలుస్తుంది.
తెలుగులో సినిమా చేస్తానని మొదట అనిల్ రావిపూడి తో సంప్రదింపులు జరిపినప్పటికి ఆ తర్వాత మాత్రం ఎందుకో ఆయన సినిమా చేయలేని పరిస్థితి ఏర్పడడంతో అడ్వాన్స్ డబ్బులైతే వెనక్కి తీసుకున్నట్టుగా గతంలో అనిల్ రాయపూడి చెప్పాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. కాబట్టి అతనితో సినిమా చేయడానికి ఒకప్పుడు తన దగ్గర అడ్వాన్స్ వెనక్కి తీసుకున్న ప్రొడ్యూసర్ సైతం ఇంట్రెస్ట్ చూపించినప్పటికి అనిల్ మాత్రం అతనితో సినిమా చేయడానికి ఒప్పుకోవడం లేదట…
మొత్తానికైతే ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ లను ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఇప్పుడు వెంకటేష్ కళ్యాణ్ రామ్ లతో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే ఆయన నాగార్జున తో ఒక సినిమా చేస్తాడట…మొత్తానికైతే ప్రతి ఇయర్ సంక్రాంతికి ఒక సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…