SKN apology video viral: అభిమానులు మాత్రమే కాకుండా, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ‘పెద్ది'(Peddi Movie) మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే సంక్రాంతి సినిమాలు మినహా, ఇప్పటి వరకు విడుదలైన ఏ చిత్రం కూడా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో అందరి ఆశలు ఇప్పుడు ‘పెద్ది’ చిత్రం మీదనే ఉంది. అయితే మార్చి 27 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్ బ్యాలన్స్ ఉండడం తో ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఏప్రిల్ 30 న కూడా ఈ చిత్రం రావడం లేదని సోషల్ మీడియా లో ఒక బజ్ నడుస్తోంది. జూన్ 25 న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ విషయం సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం తో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ చిత్రం జూన్ 25 న విడుదల అవుతుందేమో అని అనుకున్నారు.
వారిలో బేబీ మూవీ నిర్మాత SKN కూడా ఉన్నాడు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ లోని మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని నిన్న హైదరాబాద్ లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. కిరణ్ అబ్బవరం గా, శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పై యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారు అని నిన్న ఈవెంట్ కి వచ్చిన అభిమానులు చెప్పడం తో పెద్ది మూవీ జూన్ 25 న విడుదల అవుతుందని అనుకొని, పొరపాటున నోరు జారాడు SkN. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘చెన్నై లవ్ స్టోరీ మొదటి సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నేను మాట్లాడిన మాటలు మిస్ కమ్యూనికేషన్ అయ్యింది. విడుదల తేదీ ఎప్పుడు అని అడుగుతుంటే, మా సాయి రాజేష్ ఇప్పుడే న్యూస్ చూస్తున్నాను, పెద్ది జూన్ 25 అని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది అని చెప్పాడు. వాళ్ళు అధికారికంగా ప్రకటించే వరకు నువ్వు పొరపాటున కూడా దాని గురించి మాట్లాడకు అన్నాడు. కానీ నేను పొరపాటున నోరు జారేసాను. కాస్త మిస్ కమ్యూనికేషన్ వల్ల అలా జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. నా ఉద్దేశ్యం ఏమిటంటే పెద్ద హీరోల సినిమాలు లేనప్పుడు మా చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకున్నాను. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతోంది ‘ అంటూ SKN క్లారిటీ ఇచ్చాడు. దీనిని చూసి నెటిజెన్స్ అంత నోటి దూల ఎందుకు కాస్త చూసుకొని మాట్లాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
IMP CLARIFICATION: pic.twitter.com/EgRUO0c7A2
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) March 30, 2026