Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికి సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్లు గా ఎదిగిన దర్శకులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. అనిల్ రావిపూడి (Anil Ravipudi) కమర్షియల్ డైరెక్టర్ గా స్టార్ హీరోలందరిని డైరెక్షన్ చేస్తూ ముందుకు సాగడమే కాకుండా వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇప్పటివరకు 8 సక్సెస్ లను సాధించి ముందుకు దూసుకెళ్లిన ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి(Chiranjeevi) తో చేస్తున్న సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతోంది. ప్రస్తుతం భారీ సక్సెస్ ను సాధించి ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక అనిల్ రావిపూడి ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం అంటూ అతన్ని చాలామంది ప్రొడ్యూసర్లు పోగుడుతున్నారు.
Also Read: మరోసారి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి దిల్ రాజు సోదరుడు క్షమాపణలు..సంచలనం రేపుతున్న వీడియో!
నిజానికి దిల్ రాజు కాంపౌండ్ లోనే ఆయన ఎక్కువ సినిమాలు చేశాడు. అయితే ఆయన ప్రతి సినిమా విషయం లో ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని అతన్ని ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం అంటున్నారు. అంటే ఆయన ఏ సీన్ చేయడం వల్ల ఎంత ఖర్చవుతుంది. ఎంత వరకు ప్రొడ్యూసర్ ను సేఫ్ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తూ ఉంటాడని అతని ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం అంటూ ఉంటారు రీసెంట్గా దిల్ రాజు వాళ్ళ తమ్ముడు అయిన శిరీష్ (Shirish) ఇంటర్వ్యూలో చెబుతూ రీసెంట్ గా అనిల్ రావిపూడి తో మాట్లాడాను చిరంజీవితో చేస్తున్న సినిమా సెకండ్ షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో చేస్తున్నప్పుడు 17 వరకు షెడ్యూల్ వేస్తే 12కే షెడ్యూల్ చేసి తిరిగి వచ్చేసారు. అలా ఎందుకు వచ్చేసారు అని నేను అడిగినప్పుడు అనిల్ రావిపూడి చెప్పిన సమాధానం ఏంటంటే ఐదు రోజులు అక్కడ షూట్ చేయడం వల్ల ప్రొడ్యూసర్ కి 70 లక్షలు ఖర్చు అయితే అవుతుంది.
అదంతా ఇంటీరియర్ లో తీసేది కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎక్కడైనా ఇంటీరియర్ లో చీట్ చేసి తీసుకోవచ్చు. దానికి అక్కడే చేయాలనే రూల్ అయితే ఏమీ లేదు దాని వల్ల ప్రొడ్యూసర్ కి దాదాపు 70 లక్షల వరకు డబ్బులు మిగిలే అవకాశం ఉంది అని చెప్పారట. దాంతో శిరీష్ నువ్వు ప్రొడ్యూసర్ల గురించి ఆలోచించినన్ని రోజులు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అంటూ ఆయన చెప్పిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…నిజానికి అనిల్ ప్రొడ్యూసర్ల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. తను పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా సినిమా భారీ రికార్డు లను కొల్లగొడుతుండడమే కాకుండా పెట్టే పెట్టుబడులో కూడా చాలా వరకు తగ్గించి పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. దానివల్ల అతనితో సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
ఇక చాలామంది దర్శకులు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెడుతూ అనవసరమైన షాట్స్ ను తీస్తూ ఫైనల్ గా ఎడిట్ లో షాట్స్ లేకుండా చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రొడ్యూసర్స్ కి నష్టమైతే వాటిల్లుతుంది. వాటన్నింటినీ చక్కగా చూసుకున్నప్పుడే ప్రొడ్యూసర్ కూడా సేఫ్ జోన్ లో ఉంటాడు అనేది అనిల్ రావిపూడి నమ్ముతూ ఉంటాడు. కాబట్టే ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు అనిల్ ను నమ్ముతున్నారు…