Kantara And Yellamma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు కొత్త కథలతో సినిమాలు చేస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియాలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు మంచి సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే బలగం (Balagam) సినిమాతో దర్శకుడిగా మారిన వేణు (Venu) ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు… అప్పటివరకు కామెడీ క్యారెక్టర్ లను చేస్తూ వచ్చిన వేణు ఒకసారి గా దర్శకుడిగా మారి బలగం సినిమా చేసి దర్శకుడి గా తమ సత్తా చాటుకున్నాడు. ఇక. ఇలాంటి క్రమంలోనే ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో మరోసారి దిల్ రాజు బ్యానర్ లోనే ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ (Nithin) హీరోగా చేస్తున్నాడు. ఈ కథను కొంత మంది స్టార్ హీరోల దగ్గరికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. కానీ వాళ్ళు ఈ సినిమా స్టోరీని రిజెక్ట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ముఖ్యంగా నాని దగ్గరికి ఈ కథని తీసుకెళ్లారట. కానీ నానికి కథ నచ్చకపోవడంతో ఆయన ఈ సినిమాకిను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత తేజ సజ్జా (Teja Sajja) దగ్గరికి కూడా ఈ స్టోరీని తీసుకెళ్లారు. తను కూడా ఈ సినిమా కథకి అంతగా ఇంప్రెస్ అవ్వకపోవడంతో సినిమా నుంచి తను తప్పుకున్నాడు.
Also Read: దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ మూవీ..స్టోరీ లైన్ వింటే మెంటలెక్కపోతారు!
ఇక మొత్తానికైతే నితిన్ ఆల్రెడీ దిల్ రాజు ప్రొడక్షన్లో తమ్ముడు (Thammudu) సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాకి తనైతే బాగుంటాడని అనుకున్న వేణు అతనికి ఆ కథ చెప్పడంతో తను ఒప్పుకున్నాడు. మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి దర్శకుడిగా తను మరొక మెట్టు పైకి ఎక్కాలని చూస్తున్నాడు.
సూపర్ సక్సెస్ ని సాధించి ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా ఈ సినిమాతో నితిన్ ఎలాంటి స్టార్ డమ్ ను సంపాదించుకుంటాడు అనేది…అయితే ఈ సినిమా స్టోరీ తెలంగాణ విలేజ్ లో గ్రామ దేవత గా పిలుచుకొనే ఎల్లమ్మ తల్లి మీద బేస్ చేసుకొని ఉండబోతుంది అనే వార్తలైతే వస్తున్నాయి…
ఇక ఈ సినిమాలో హీరోకి క్లైమాక్స్ లో దేవుడు కూడా పూనుతాడట…ఇక కాంతార లో హీరోకి క్లైమాక్స్ లో దేవుడు వచ్చినట్టుగా సేమ్ ఇందులో కూడా అలాగే చేయబోతున్నట్లుగా తెలుస్తోంది… చూడాలి మరి ఎల్లమ్మ కూడా కాంతార రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది…