Mirai Producer gifts Teja Sajja: రీసెంట్ గా విడుదలైన తేజ సజ్జ(Teja Sajja) మిరాయ్(Mirai Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ‘హనుమాన్’ వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ నుండి వస్తున్న సినిమా కావడంతో పాటు, విడుదలకు ముందే థియేట్రికల్ ట్రైలర్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్స్ క్లిక్ అవ్వడంతో ఈ సినిమా పై అంచనాలు భారీ గా పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకోవడం లో ఈ సినిమా సక్సెస్ అవ్వడం, ఫలితంగా కలెక్షన్స్ భారీ రేంజ్ లో రావడం తో నిన్న ఈ సినిమాకు సంబంధించి ఒక సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ ఈవెంట్ కి మూవీ టీం మొత్తం పాల్గొనింది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
ఇదంతా పక్కన పెడితే ప్రముఖ రచయితా BVS రవి నిర్మాత విశ్వ ప్రసాద్ తో మాట్లాడుతూ ‘సార్..తేజ సజ్జ మీకు మిరాయ్ చిత్రం రూపం లో పెద్ద కమర్షియల్ సక్సెస్ ని అందించాడు. కాబట్టి మీరు కచ్చితంగా హీరో గారికి ఎదో ఒక బహుమతి ఇక్కడే, ఇప్పుడే ప్రకటించాలి’ అని అంటాడు. అప్పుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘హీరో తేజ సజ్జ కి, మరో హీరో అయినటువంటి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కి కార్లు బహుమతిగా ఇస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. వాళ్ళిద్దరికీ గిఫ్ట్స్ ఇస్తామని చెప్పారు, ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఈ సినిమాలో విలన్ క్యారక్టర్ చేసిన మంచు మనోజ్ కి కూడా ఎదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఆయన్ని మాత్రం అసలు పట్టించుకోలేదు నిర్మాత విశ్వప్రసాద్. ఇది ఆడియన్స్ కి ఏ మాత్రం నచ్చలేదు.
ఈ సినిమాకు తేజ సజ్జ ఎంత ముఖ్యమో, మంచు మనోజ్(Manchu Manoj) కూడా అంతే ముఖ్యం. హీరో కి ఎంత మంచి పేరొచ్చిందో, విలన్ క్యారక్టర్ చేసిన మనోజ్ కి కూడా అదే రేంజ్ పేరొచ్చింది. ఇంకా చెప్పాలంటే మనోజ్ కే ఎక్కువ పేరొచ్చింది. అలాంటిది కనీసం మాట వరుసకు అయినా మనోజ్ కి కారుని బహుమతిగా ఇస్తానని ఒక మాట చెప్పుంటే బాగుండేది అని విశ్లేషకుల అభిప్రాయం కూడా. అయితే మనోజ్ కి ఈ సినిమాకు అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారనే టాక్ ఉంది. హీరో తేజ సజ్జ తనకు మార్కెట్ లేని సమయం లో ఒప్పుకున్న సినిమా కాబట్టి, ఆయన కేవలం కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే అందుకున్నాడని, మనోజ్ మాత్రం ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ ని అందుకున్నాడని, అందుకే నిర్మాత ఆయనకు గిఫ్ట్ ప్రకటించి ఉండకపోయుండొచ్చు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
మిరాయి చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా.. హీరో #TejaSajja కి, డైరెక్టర్ #KarthikGattamneni కి Cars గిఫ్ట్ గా ఇస్తున్నట్టు అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్. #Mirai pic.twitter.com/rr8AJjXZfS
— H A N U (@HanuNews) September 16, 2025