Nayeem Dairies: నయీం డైరీస్​కు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.. సినిమా ఆపేయాలని ఆదేశం

Nayeem Dairies:  ప్రముఖ గ్యాంగ్​స్టర్ నయీమ్​ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా నయీమ్ డైరీస్​. తాజాగా ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.  అయితే, ప్రస్తుత ఈ సినిమా బృందానికి తెలంగాణ హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇటీవలే ఈ సినిమాలో తెలంగాణ ఉద్యమ కారులైన బెల్లి లలితను ఇందులో అసభ్యంగా చూపించారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఆమె కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నయూం డైరీస్​ సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు […]

Written By: Sekhar Katiki, Updated On : December 13, 2021 1:50 pm
Follow us on

Nayeem Dairies:  ప్రముఖ గ్యాంగ్​స్టర్ నయీమ్​ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా నయీమ్ డైరీస్​. తాజాగా ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.  అయితే, ప్రస్తుత ఈ సినిమా బృందానికి తెలంగాణ హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇటీవలే ఈ సినిమాలో తెలంగాణ ఉద్యమ కారులైన బెల్లి లలితను ఇందులో అసభ్యంగా చూపించారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఆమె కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నయూం డైరీస్​ సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు తొలగించే వరకు సినిమా ఆపేయని ఆదేశించారు.

అయితే చిత్రబృందం స్పందిస్తూ.. ఆ సీన్​లను తొలగించేందుకు రెండ్రోజుల గడువు కావాలని కోరారు.. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాలో సీన్స్ తొలగించాలని చెప్పి.. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది తెలంగాణా హైకోర్టు. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన రోజే  తెలంగాణలో పలు చోట్ల ఈ సినిమాను అడ్డుకున్నారు.

నయూం గ్యాంగ్​స్టర్​ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీం.. ఎన్​కౌంటర్​లో చనిపోయాడు. ఈ క్రమంలోనే గతంలో రామ్​గోపాల్​ వర్మ కూడా ఇతనిపై సినమా తీస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ తర్వాత మళ్లీ ఆర్జీవీ నుంచి ఎలాంటి అప్​డేట్​ రాలేదు.