https://oktelugu.com/

Priyanka Jain: దాడులు చేయడమేంటి… పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై ప్రియాంక షాకింగ్ కామెంట్స్

నచ్చని వారిని వ్యతిరేకించ వచ్చు .. కానీ ఇలా దాడులు చేయడం దుర్మార్గం. అమర్ దీప్ కారు పై ఎటాక్ చేసారు. లోపల వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఉన్నారనే జ్ఞానం కూడా లేకుంటే ఎలా. హౌస్ లో మేము కేవలం టాస్కుల్లో మాత్రమే గొడవ పడతాం.

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2023 / 06:18 PM IST

    Priyanka Jain

    Follow us on

    Priyanka Jain: బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తూ తన తోటి కంటెస్టెంట్స్ స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక జైన్ మాట్లాడుతూ .. అభిమానం పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేయడం చాలా దారుణం. తాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కార్లు కొంటాము. వాటిని ఇలా క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా ప్రశాంత్ నిలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువ సేపు కొనసాగలేదు.

    అభిమానం చూపించవచ్చు .. నచ్చని వారిని వ్యతిరేకించ వచ్చు .. కానీ ఇలా దాడులు చేయడం దుర్మార్గం. అమర్ దీప్ కారు పై ఎటాక్ చేసారు. లోపల వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఉన్నారనే జ్ఞానం కూడా లేకుంటే ఎలా. హౌస్ లో మేము కేవలం టాస్కుల్లో మాత్రమే గొడవ పడతాం. మిగిలిన టైములో మేము చాలా ఫ్రెండ్లీ గా ఉంటాము. నిజం చెప్పాలంటే చివరి నాలుగు వారాల్లో పల్లవి ప్రశాంత్ తో నాకు చాలా మంచి బాండింగ్ ఏర్పడింది.

    శివాజీ, యావర్, అమర్, ప్రశాంత్ తనకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రియాంక చెప్పింది. అందరం చాలా బాగా క్లోజ్ అయ్యాం. పల్లవి ప్రశాంత్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ప్రియాంక తెలిపింది. అయితే ఈ ఇంటర్వ్యూ సమయానికి ప్రశాంత్ ఇంకా అరెస్ట్ కాలేదు. అందుకే ఆమెకు అరెస్ట్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురు కాలేదు.

    అయితే ప్రస్తుతం కోర్టు పల్లవి ప్రశాంత్ కి 14 రోజుల రేమండ్ విధించింది. పోలీసుల తరుపున న్యాయవాదులు ప్రశాంత్ కు బెయిల్ ఇవ్వకూడదని వాదిస్తున్నారట. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కి మద్దతుగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ చట్టబద్దంగా త్వరలో బయటకు వస్తాడని శివాజీ కామెంట్స్ చేశాడు. అలాగే శుభ శ్రీ, అశ్విని, సోహెల్, భోలే లాంటి వారంతా ప్రశాంత్ కి మద్దతుగా నిలుస్తున్నారు.