NTR: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక అప్పటినుంచి ఆయన వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఒకానొక సందర్భంలో ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదుగుతాడు చిరంజీవి తర్వాత ఇండస్ట్రీలో తను ఒక స్టార్ హీరోగా వెలుగు వెలుగుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత అతనికి చాలా ఫ్లాప్ సినిమాలు రావడంతో ఎన్టీఆర్ జోరుకి బ్రేక్ పడింది. అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన కొంతమంది ప్రొడ్యూసర్లు భారీగా నష్టపోయారు.
అందులో ఎన్టీఆర్ బి.గోపాల్ దర్శకత్వంలో చేసిన నరసింహుడు సినిమా ప్రొడ్యూసర్ అయిన చెంగల వెంకటరావు ఆ సినిమా ప్లాప్ అవ్వడం తో భారీగా నష్టపోయాడు. ఈ సినిమాకి మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ రావడంతో ఆయన ఆ సినిమా కోసం పెట్టిన అప్పు తీర్చుకోలేక హుసేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ ఉన్న కొంతమంది అతన్ని సేవ్ చేయడంతో బతికి బట్ట కట్టాడు…
ఇక అదే రీతిలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అశోక్ సినిమా కూడా భారీ డిజాస్టర్ అయింది.ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయిన వల్లూరుపల్లి రమేష్ కూడా భారీగా నష్టపోయాడు. ఆయన తర్వాత పెద్దగా సినిమాలు కూడా చేయకుండా పోయాడు అంటే ఈ సినిమా ద్వారా అతనికి చాలా లాస్ అయితే వచ్చింది. అందువల్ల అతను సినిమాలు చేయకుండా ఇండస్ట్రీకి కొద్దిరోజుల పాటు దూరంగా ఉంటున్నాడు…
ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన కంత్రీ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆయనకి వచ్చిన నష్టాలను తట్టుకొని నిలబడ్డాడు. అయినప్పటికీ అశ్వినీ దత్ స్టార్ ప్రొడ్యూసర్ కాబట్టి ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నాడు కానీ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన రెండోవ సినిమా శక్తి మాత్రం భారీ డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమా వల్ల అశ్విని దత్ భారీగా నష్టపోయాడు. ఎంతలా అంటే అంత పెద్ద టాప్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఏ సినిమా ప్రొడ్యూస్ చేయకుండా ఖాళీగా ఉన్నాడు మళ్ళీ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మహానటి సినిమాకి ప్రొడ్యూసర్ గా మారడంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.ఇక దాంతో మళ్ళీ అయన ప్రొడ్యూసర్ గా సినిమాలు కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరో గా కల్కి అనే సినిమా చేస్తున్నాడు…ఇలా ఎన్టీఆర్ దెబ్బకి చాలా మంది ప్రొడ్యూసర్లు గల్లంతయ్యారు…