https://oktelugu.com/

Kavitha: కవితకు భారీ షాక్!

విచారణ జరిపిన కోర్టు.. తీర్పును మే 6వ తేదీ వరకు రిజర్వు చేసింది. ఈమేరకు సోమవారం ఉదయం ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 6, 2024 / 03:05 PM IST

    Kavitha bail plea Rejected

    Follow us on

    Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ కల్వకుంట్ల కవితకు మళ్లీ చెక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది. తిహార్‌ జైల్లో ఉన్న కవిత ఈడీ, సబీఐ కేసుల్లో వేర్వేరుగా బెయిల్‌ పిటటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్టార్‌ క్యాంపెయిన్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని పేర్కొన్నారు. మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందని తెలిపారు.

    పిటిషన్లు తిరస్కరణ..
    విచారణ జరిపిన కోర్టు.. తీర్పును మే 6వ తేదీ వరకు రిజర్వు చేసింది. ఈమేరకు సోమవారం ఉదయం ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు. కవిత బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల విచారణ సందర్భంగా కవితతోపాటు ఈడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్టు చేశారని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా అరెస్టు చేశారని తెలిపారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ అరెస్ట్‌ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవిత బీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ అని, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయాల్సి ఉందని చెప్పారు.

    బెయిల్‌ ఇవ్వొద్దన్న దర్యాప్తు సంస్థలు..
    ఇక కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని దర్యాప్తు సంస్థలు కోర్టుకు విన్నవించాయి. లిక్కర్‌ కేసులో కవిత చాలా కీలకమని, శక్తివంతమైన మహిళ అని పేర్కొన్నాయి. ఇప్పటికే డిజిటల్‌ ఎవిడెఎన్స్‌ ధ్వసం చేశారని, బెయిల్‌ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని, సాక్షాలను ప్రభావితం చేస్తారని తెలిపాయి. కేసులో సూత్రధారి, పాత్రధాని కవితే అని కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవితకు బెయిల్‌ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    గతంలో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌..
    గత ఏప్రిల్‌లో కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ వేశారు. తన కొడుకుకు పరీక్షలు జరుగుతున్నాయని, తల్లిగా తన బాధ్యత నిర్వహించాల్సి ఉందని కోర్టును కోరింది. ఈమేరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించింది. అప్పడు కూడా ఈడీ కవిత బెయిల్‌ను వ్యతిరేకించింది. దీంతో ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది.