Homeఎంటర్టైన్మెంట్ప్రియాంక చోప్రాకి విడాకులు తథ్యం అట !

ప్రియాంక చోప్రాకి విడాకులు తథ్యం అట !

Priyanka Chopra Nick Jonas Divorceహీరోయిన్ల పెళ్లి పెటాకులవడం అనేది ఎప్పటి నుండో వస్తోన్న ఆనవాయితీ అని, సినిమా ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారం చాలా మామూలు విషయం అని ఇలా గతంలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసిన బాలీవుడ్ సినీ విశ్లేషకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌, మరో సారి తన పైత్యాన్ని ప్రదర్శించాడు. అయితే, ఈ సారి ఆ పైత్యం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మీద ఎక్కువ ప్రభావం చూపింది.

రానున్న కాలంలో ప్రియాంక చోప్రాకి విడాకులు ఖాయం అంటూ ఈ సినీ విశ్లేషకుడు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ‘ప్రియాంకకు ఆమె భర్త నిక్‌ జోనస్‌ మరో పది సంవత్సరాలలో విడాకులు ఇవ్వడం తథ్యం’ అని ఏదో బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్లు చెప్తూ కేఆర్‌కే ఒక ట్వీట్‌ పడేశాడు. ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు అతగాడి మీద విరుచుకుపడుతున్నారు.

ఇక ప్రియాంక ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ప్రియాంక జంట విడిపోవాలని కోరుకునే హక్కు నీకెక్కడిది ? నువ్వు ఒక పనికిమాలిన వెధవ్వి.. స్టార్ల వ్యక్తిగత విషయాల గురించి నువ్వు మాట్లాడకపోతేనే నీకు మంచిది. లేకపోతే నువ్వు ఎన్నో బాధలు అనుభవించాల్సి ఉంటుంది’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

అయినా ఈ ‘ప్రిడిక్షన్‌’ పైత్యంతో నోటికొచ్చినట్లు మాట్లాడే కేఆర్‌కేను పబ్లిక్‌ లో చితక్కొట్టాలని.. అసలు ఇతగాడికి ప్రతిదాంట్లో తలదూర్చడం అలవాటు అయిపోయింది అని, అందుకే ఆ అలవాటు మానుకునేలా అతనికి తగిన శాస్తి చేయాలని సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఎవరు తనను ఎంతగా బెదిరించినా సెలబ్రిటీల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడమే తన బాధ్యత అన్నట్టు ఉండే కేఆర్‌కే ఇప్పట్లో ఎవర్నీ వదిలిపెట్టేలా లేడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper
Exit mobile version