Homeఎంటర్టైన్మెంట్Priyanka Chopra statement on divorce: తన భర్త తో విడాకుల వ్యవహారం పై మొదటిసారి...

Priyanka Chopra statement on divorce: తన భర్త తో విడాకుల వ్యవహారం పై మొదటిసారి స్పందించిన ప్రియాంక చోప్రా..!

Priyanka Chopra statement on divorce: తమిళ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసి, ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి, వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ, లేడీ సూపర్ స్టార్ అనే రేంజ్ కి ఎదిగిన ప్రియాంక చోప్రా(Priyanka Chopra), గత దశాబ్ద కాలం నుండి ఇండియన్ సినిమాకు దూరమై, హాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా మారిపోయింది. అక్కడ ఈమె హీరోయిన్ గా పలు సినిమాలు, అదే విధంగా విలన్ గా పలు సినిమాలు చేస్తూ హాలీవుడ్ ఆడియన్స్ కి పిచ్చెక్కిపోయేలా చేసింది. ఇకపోతే రీసెంట్ గానే ఈమె రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కిస్తున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రంతో మన ఇండియన్ సినీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. పేరుకే ఇది ఇండియన్ సినిమా, కానీ దీన్ని రాజమౌళి గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు చూస్తున్నాడు.

అయితే రీసెంట్ గానే ఆమె హాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె విడాకులు తీసుకుంది అంటూ వచ్చిన వార్తలపై చాలా ఘాటుగానే రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ మా బంధం ఎప్పుడెప్పుడు కూలిపోతుందా?, మేము ఎప్పుడు విడిపోతామా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వాళ్లకు ఇదే నా సమాధానం. నాకు, నిక్ కి పెళ్లి జరిగి ఎనిమిదేళ్లు దాటింది. మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోవాలని కోరుకునే వాళ్ళు, కోరుకోండి అది మీ ఇష్టం. అలాంటి కామెంట్స్ గురించి ఆలోచించడం కూడా మానేశాను. మొదట్లో ఇలాంటి వ్యాఖ్యలు నన్ను చాలా బాధకు గురి చేసేవి, కానీ ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాను’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.

ఇంకా ఆమె తన భర్త నిక్ జోనాస్ గురించి మాట్లాడుతూ ‘నేను నిక్ ని కలిసిన ఆరు నెలలకే పెళ్లి చేసుకున్నాను. అతను చాలా నిజాయితీగా ఉండే మనిషి. పరిచయమైనా కొత్తల్లో అతని నిజాయితీ చూసి నాకు ఆశ్చర్యం వేసేది. ఒక మనిషి ఇంత నిజాయితీగా ఎలా ఉండగలడు?, బహుశా అతను నటిస్తున్నాడేమో అని అనుకునేదానిని. కానీ అతనితో ట్రావెల్ చేస్తున్న కొద్దీ అతను ఎలాంటి వాడు అనేది తెలిసొచ్చింది. అతని సహజ స్వభావమే అంత. చాలా నిజాయితీ గల కుర్రాడు. అతని తల్లిదండ్రులు చాలా విలువలతో కూడిన మన్సుషులు. తమ బిడ్డకు కూడా ఆ విలువలు నేర్పించారు’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper
Exit mobile version