కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత యూపీఐ చెల్లింపుల ద్వారా లావాదేవీలు జరిపే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లావాదేవీలను జరుపుతున్నారు. కరోనా విజృంభణ తర్వాత యూపీఐ చెల్లింపుల్లో గణనీయమైన పెరుగుదల నమోదు కాగా ప్రజలు సైతం డిజిటల్ లావాదేవీలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉండటం గమనార్హం. అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా యూపీఐ సర్వీసులను ఆవిష్కరించింది.
ఐఎంపీఎస్ ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవల ద్వారా ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ కు డబ్బులను వేగంగా పంపించుకునే అవకాశం ఉంటుంది. అయితే యూపీఐ లావాదేవీలకు పరిమితులు ఉంటాయి. యూపీఐ కస్టమర్లు రోజుకు కేవలం 10 లావాదేవీలు మాత్రమే చేసే అవకాశం ఉండటంతో పాటు లక్ష రూపాయల వరకు మాత్రమే పంపవచ్చు.
ఈ రెండు లిమిట్ లలో ఏ లిమిట్ ను దాటినా తర్వాత రోజు వరకు డబ్బులు పంపడానికి వీలు ఉండదని గుర్తుంచుకోవాలి. యూపీఐ ఆధారంగా పని చేసేవాటిలో గూగుల్ పే కూడా ఒకటనే సంగతి తెలిసిందే. యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ గూగుల్ పేకు కూడా కచ్చితంగా వర్తిస్తాయి. అయితే బ్యాంక్ ను బట్టి యూపీఐ ద్వారా ఎంత డబ్బులు పంపొచ్చనే అంశం కొన్నిసార్లు మారే అవకాశం అయితే ఉంటుంది.
ఇతర యూపీఐ యాప్స్ కు కూడా దాదాపుగా ఇవే నిబంధనలు వర్తిస్తాయని చెప్పవచ్చు. యూపీఐ యాప్స్ సహాయంతో ఇతరులకు డబ్బులను సులభంగా పంపడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. డిజిటల్ లావాదేవీల వల్ల ప్రజలకు సైతం రివార్డులు, క్యాష్ బ్యాక్ ల ద్వారా ప్రయోజనం చేకురుతుంది.