Priyanka Chopra Emotional Comments: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించి నేషనల్ అవార్డ్స్ కూడా అందుకొని, ఎవర్గ్రీన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra), ఆ తర్వాత తన స్థాయిని పెంచుకుంటూ హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ ఎంత అగ్రస్థాయికి చేరుకుందో, హాలీవుడ్ లో విలన్ గా, హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, ఇలా ఎన్నో రకాల పాత్రలతో మిలియన్ డాలర్లు పారితోషికం అందుకునే హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె తన మకాం కూడా అమెరికా కి మార్చేసింది. అక్కడ తన ఆస్తులను ఏర్పాటు చేసుకొని, శాశ్వతంగా హాలీవుడ్ లోనే స్థిరపడింది. అలాంటి ఆమె ఇప్పుడు మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో లేడీ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఒక ప్రముఖ ఈవెంట్ లో పాల్గొన్న ఈమె, బాలీవుడ్ ఇండస్ట్రీ పై కొన్ని హాట్ కామెంట్స్ చేసింది.
Also Read: వాయిదా పడ్డ ‘మిరాయ్’ చిత్రం..’కాంతారా’ కూడా అనుమానమే..’ఓజీ’ కి తిరుగులేదు!
ఆమె మాట్లాడుతూ ‘బాలీవుడ్ ఇండస్ట్రీ లో పురుషాధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మేము హీరోలతో సమానంగా కష్టపడి పని చేస్తుంటాము, కానీ మా రెమ్యూనరేషన్ హీరో కి వచ్చే రెమ్యూనరేషన్ లో 10వ శాతం కూడా ఉండదు. ఇదెక్కడి న్యాయం చెప్పండి. హీరో ఏది చెప్తే అది జరుగుతుంది. హీరోయిన్ మాట అసలు చెల్లదు. మేము ఏమైనా డిమాండ్ చేస్తే మమ్మల్ని సినిమా నుండి తీసేస్తారు. షూటింగ్ కి కూడా మాకు ఎన్ని వ్యక్తిగత పనులు ఉన్నా సమయానికి వచేస్తాము. హీరో ఆ సమయం లో హీరో మాత్రం రాడు. ఆయన వచ్చేంత వరకు మేము క్యారవ్యాన్ లో ఖాళీగా కూర్చుకోవాల్సిందే. కానీ హాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితి ఉండదు. హీరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో, హీరోయిన్ కూడా అంతే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
ప్రియాంక చోప్రా మాటలు చూస్తుంటే ఇవన్నీ బాలీవుడ్ లో ఆమె అనుభవించి, చిరాకు వచ్చి ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అయితే హాలీవుడ్ లో ఒక్కో సినిమాకు మిలియన్ డాలర్ల పారితోషికం అందుకుంటూ బిజీ గా ఉంటున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి మూవీ లో నటించడానికి ఎంత రెమ్యూనరేషన్ అందుకుంటుంది?, మహేష్ తో సమానంగా ఆమె రెమ్యూనరేషన్ ని అందుకుంటుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ లో ఆమె రెగ్యులర్ గా పాల్గొంటుంది. విలన్ క్యారెక్టర్స్ కి ఇప్పుడు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వడం తో రాజమౌళి ఏరికోరి ఈ సినిమాలో పెట్టుకున్నాడు. మరి ఆమె క్యారక్టర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఆమెకు జోడీ గా మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు.