Mirai Movie First Review: ‘హనుమాన్’ వంటి భారీ సంచలనాత్మక చిత్రం తర్వాత తేజ సజ్జ హీరో గా నటించిన చిత్రం ‘మిరాయ్'(Mirai Movie). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ(People’s Media Factory) పై కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు మాములు రేంజ్ లో లేవు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కొంత జాప్యం ఉండడం వల్ల ఏ సినిమా అనుకున్న తేదికి వచ్చే అవకాశాలు లేవనే రూమర్ కూడా గట్టిగా వినిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి అది రూమర్ మాత్రమే. ఒకవేళ వాయిదా పడితే రెండు వారాలు వెనక్కి వెళ్లే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ సినిమాకు సంబంధించిన రషస్ ని నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది మీడియా మిత్రులతో కలిసి చూశారట మేకర్స్. వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: కష్టపడినా గుర్తించట్లేదు అంటూ ప్రియాంక చోప్రా ఎమోషనల్ కామెంట్స్
ఈ సినిమాని చూస్తున్నంత సేపు ఒక టాలీవుడ్ సినిమాని, లేదా ఇండియన్ సినిమాని చూస్తున్నట్టుగా అనిపించలేదట. ఒక హాలీవుడ్ చిత్రాన్ని చూస్తున్న అనుభూతినే కనిపించిందట. హనుమాన్ చిత్రం లో రామ తత్త్వం, హనుమాన్ భక్తి అంతర్లీనంగా చూపించారు. క్లైమాక్స్ లో హనుమాన్ ఎంట్రీ ఆడియన్స్ కి ఏ రేంజ్ గూస్ బంప్స్ అనుభూతిని కలిగించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం లో కూడా అలా క్లైమాక్స్ లో శ్రీకృష్ణుడి ఎంట్రీ ఉంటుందట. ఆడియన్స్ కి ఈ ఎంట్రీ చాలా సర్ప్రైజ్ కి గురి చేస్తుందని, ఒక ప్రముఖ స్టార్ హీరో ఆ పాత్రలో కనిపించాడని అంటున్నారు. అంతే కాకుండా ఈ చిత్రం లో సూపర్ విలన్ గా మంచు మనోజ్ కూడా అద్భుతంగా నటించాడట. ఆయన క్యారక్టర్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ఓవరాల్ గా ఈ సినిమాకు సంబంధించిన హైలైట్స్ విషయానికి వస్తే కథ, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, కళ్ళు చెమర్చే విజువల్స్, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే ఒక కీలక సన్నివేశం, సెకండ్ హాఫ్ లో రెండు మూడు యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు శ్రీకృష్ణుడి ఎంట్రీ ఈ చిత్రాన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్తాయట. ఇక మైనస్సుల విషయానికి వస్తే కొన్ని కొన్ని చోట్ల ‘హనుమాన్’ షేడ్స్ కనిపిస్తాయని, అంతే కాకుండా B,C సెంటర్స్ ఆడియన్స్ కి అర్థం అవ్వని సన్నివేశాలు కొన్ని ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా తేజ సజ్జ కి ఒక భారీ బ్లాక్ బస్టర్ పడినట్టే. ఈ చిత్రం తో ఆయన తన పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ ని మరింత పదిలం చేసుకోబోతున్నాడు అని అనుకోవచ్చు. చూడాలి మరి ఆడియన్స్ నుండి కూడా ఇలాంటి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది.