Chiranjeevi Anirudh Ravichander: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 70 వ సంవత్సరం లోకి నిన్ననే అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వయస్సులో కూడా ఆయన నేటి తరం స్టార్ హీరోలకంటే వేగంగా సినిమాలు చేస్తూ, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొడుతూ ఫుల్ బిజీ గా ఉంటున్నాడు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి తో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నాడు’ అనే చిత్రం చేస్తున్నాడు. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా ఇప్పటికే ఆయన విశ్వంభర చిత్రాన్ని కూడా పూర్తి చేసాడు. కానీ సెకండ్ హాఫ్ కి గ్రాఫిక్స్ వర్క్ భారీ గా ఉండడం వల్ల, మరింత సుదీర్ఘ సమయం తీసుకుంటూ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు మేకర్స్.
Also Read: వాయిదా పడ్డ ‘మిరాయ్’ చిత్రం..’కాంతారా’ కూడా అనుమానమే..’ఓజీ’ కి తిరుగులేదు!
ఈ రెండు చిత్రాలు కాకుండా ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లీ(Bobby Kolly) తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతం లో బాబీ మెగాస్టార్ కి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ కమర్షియల్ హిట్ ని అందించాడు. చిరంజీవి ని ఎలా చూపిస్తే ప్రేక్షకులు నచ్చుతారో, అలా చూపించే ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నం లో కొంతవరకు సఫలం అయ్యాడు అనే చెప్పాలి. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. ఇప్పుడు మెగాస్టార్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని కోణంలో చూపించే ప్రయత్నం చేయబోతున్నాడట. అయితే ఈ సినిమాకు ముందుగా అనిరుద్(Anirudh Ravichander) ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆయన డేట్స్ అందుబాటులో లేకపోవడం తో థమన్ ని ఎంచుకున్నట్టు సమాచారం. అనిరుద్ ఈ చిత్రానికి దాదాపుగా ఖరారు అయిపోయినట్టే అని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి.
కానీ ఇప్పటికే ఆ చేతినిండా సినిమాలు ఉన్నాయని, మీరు కోరుకునే టైం లో మీ చిత్రానికి మ్యూజిక్ అందించడం కష్టమే అని చెప్పడం తో బాబీ థమన్ ని ఎంచుకున్నాడు. అయితే అనిరుద్ లాంటి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ మిస్ అయినందుకు అభిమానులు చాలా బాధపడుతున్నారు. అయితే ఈ సినిమాకు మిస్ అయినప్పటికీ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు మాత్రం అనిరుద్ కచ్చితంగా సంగీతం అందిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని నిర్మించబోతున్నాడు. ‘ది ప్యారడైజ్’ చిత్రం పూర్తి అవ్వగానే, చిరంజీవి సినిమాకు సంబంధించిన పనులు మొదలు అవ్వబోతున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థం నుండి ఈ చిత్రం మొదలు అవ్వొచ్చు. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.