Mirai Movie Postponed: ఆగష్టు నెల ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తీవ్రంగా నిరాశపర్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కూలీ'(Coolie Movie), ‘వార్ 2′(War 2 Movie) చిత్రాలు ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశపరచడమే కాకుండా, బయ్యర్స్ కి భారీ నష్టాలను కూడా మిగిలించాయి. ‘కూలీ’ చిత్రం తెలుగు రాష్ట్రాల వరకు బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా ఉంది. అదే విధంగా నార్త్ అమెరికా లో కూడా దాదాపుగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ వీకెండ్ లో అందుకుంటుంది. కానీ తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం దాదాపుగా అసాధ్యం లాగానే అనిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడు లో అయితే అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ‘వార్ 2′(War 2 Movie) సంగతి సరే సరి. దేశం లోనే టాప్ 1 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాగా ఈ చిత్రం నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read: ఆ వైసీపీ సీనియర్ కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
జులై 25 న విడుదలైన ‘మహావతార్ నరసింహా’ చిత్రమే ఇంకా థియేటర్స్ లో భారీ వసూళ్లను రాబడుతూ బయ్యర్స్ కి కాస్త ఊరట ని కలిగిస్తుంది. ఇలా ఆగష్టు నెలలో వరుసగా ఎదురు దెబ్బలు తగలడంతో, బయ్యర్స్ సెప్టెంబర్ నెల నుండి విడుదలయ్యే సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముందుగా తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తేజ సజ్జ కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. అయితే షాక్ కి గురి చేసే విషయం ఏమిటంటే ఈ సినిమా వాయిదా పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. నేడు తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఆ పోస్టర్ లో కూడా విడుదల తేదీని లేపేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి అయ్యే అవకాశాలు లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
మరో రెండు వారాల వరకు ఈ సినిమాని వాయిదా వేసే అవకాశం ఉందట. అంటే సెప్టెంబర్ 19 న విడుదల అవ్వొచ్చు అంటున్నారు. అలా కాకుండా సెప్టెంబర్ 12 న కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారట. ఈ రెండు తేదీలు మాత్రమే కాకుండా గాంధీ జయంతి కి విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నారట. త్వరలోనే విడుదల తేదీ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా అక్టోబర్ 2న విడుదల కావాల్సిన ‘కాంతారా: చాప్టర్ 1’ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. ఇదే కనుక జరిగితే సెప్టెంబర్ 25 న విడుదల అవ్వబోయే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి తిరుగే ఉండదు అనుకోవచ్చు.