Sree Vishnu
Sree Vishnu: యంగ్ హీరోలలో విభిన్నమైన సినిమాలను తీస్తూ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న హీరోలలో ఒకరు శ్రీ విష్ణు(Sri Vishni). షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మొదలైన ఇతని కెరీర్, ఆ తర్వాత ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో సినీ కెరీర్ మొదలైంది. ఈ చిత్రం తర్వాత అనేక సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ చేస్తూ వచ్చిన శ్రీ విష్ణు, ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ హీరో గా మారి ఎన్నో విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ అవి కమర్షియల్ గా పెద్ద రేంజ్ సక్సెస్ ని చూడలేకపోయాయి. మధ్యలో రెండు మూడు సినిమాలు పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినప్పటికీ, కెరీర్ ని ఒక రేంజ్ లో మలుపు తిప్పి, శ్రీ విష్ణు కి కమర్షియల్ హీరో అని పేరు తెచ్చిపెట్టిన చిత్రం ‘సమజవరగమనా’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నార్త్ అమెరికా లో కూడా ఏకంగా 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
Also Read: కొత్త జంట చైతు-శోభిత సాహసాలు… రేస్ ట్రాక్ మీద దూసుకెళ్లిన స్టార్ కపుల్!
ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘స్వాగ్’ చిత్రం వెరైటీ గా ఉన్నప్పటికీ కమర్షియల్ గా ఫ్లాప్ గా నిల్చింది. కానీ శ్రీ విష్ణు తన పంథాని మాత్రం మార్చలేదు. అందరి లాగానే ఇతను కూడా ఫక్తు కమర్షియల్ సినిమాలు చేస్తే సూపర్ హిట్స్ కొట్టగలడు. కానీ ఆడియన్స్ ఆయన వేసుకున్న బ్రాండ్ ఇమేజ్ చెరిగిపోకుండా ఉండేందుకు ఇప్పటికీ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు పోతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీ విష్ణు హీరో గా ‘సింగిల్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తో పాటు ఆయన ‘మృత్యుంజయ్’ అనే థ్రిల్లర్ సబ్జెక్టు చేస్తున్నాడు. ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా ఆయన ‘ఐటెమ్’ అనే టైటిల్ తో మరో సినిమా కూడా చేస్తున్నాడు.
‘స్వాతిముత్యం’ లాంటి ఎంటర్టైనర్ ని అందించిన లక్ష్యం కె కృష్ణ ఈ సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ కి సంబంధించి అధికారిక ప్రకటన బయటకు రావాల్సి ఉంది కానీ, ఇదే టైటిల్ ని ఖరారు చేసినట్టు మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్నాడు. నాగవంశీ ఈమధ్య కాలంలో చేస్తున్న ప్రతీ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్స్ అవుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇలా వరుసగా గీతా ఆర్ట్స్(Geetha Arts), సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్స్ లో శ్రీ విష్ణు సినిమాలు పడుతున్నాయి. ఈసారి కచ్చితంగా ఆయన కమర్షియల్ గా గట్టి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోబోతున్నాడని విలేషకులు అంటున్నారు.