Priyamani: బబ్లీ హీరోయిన్ గా ప్రియమణికి మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ‘యమదొంగ’ సినిమా తర్వాత ఆమె డేట్లు కోసం చాలామంది దర్శక నిర్మాతలు ఆమె చుట్టూ తిరిగారు. అయితే, ఇక్కడే పొరపాటు చేసింది ప్రియమణి. కొంతమంది హీరోయిన్లుకు ఒకేసారి పది సినిమాల డబ్బులు సంపాదించాలనే ఆశ ఉంటుంది. అందుకే ఎంత భారీ రెమ్యునరేషన్ ఇచ్చినా అలాంటి హీరోయిన్ కి తృప్తి ఉండదు.

స్టార్ హీరోయిన్ గా పేరు రాగానే క్యాష్ చేసుకోవాలని తెగ ఉబలాటపడుతుంటారు. అలాంటి జాబితాలోకే వస్తోంది ప్రియమణి కూడా. అందరి స్టార్ హీరోలతో ఆడిపాడే అవకాశాలను కూడా వదులుకుంది రెమ్యునరేషన్ విషయంలో. పైగా డబ్బులు కోసం వచ్చిన ప్రతి చిన్నాచితకా సినిమా ఒప్పేసుకుని బ్యాంక్ బ్యాలెన్స్ ను ఫుల్ గా నింపేసుకుంది. కట్ చేస్తే.. వచ్చిన స్టార్ డమ్ పోయింది.
రెండేళ్లు తిరిగే సరికి ఆమెకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా కరువయ్యారు. ఇక హీరోయిన్ గా తెలుగులో కెరీర్ లేదు అని అర్ధం అయ్యాక, కన్నడంలోకి వెళ్ళింది. అక్కడా డబ్బే మెయిన్ అన్నట్టు కెరీర్ ను కొనసాగించింది. మొత్తానికి అన్నీ భాషల్లో హీరోయిన్ గా గుర్తింపును కోల్పోయాక ఇక చేసేది ఏమి లేక సైలెంట్ గా పెళ్లి చేసుకుని.. డీసెంట్ గా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. కానీ ఈ లోపు ఓ టీవీ షో వచ్చింది.
అంతే.. అన్నీ వదిలేసి ఆ షో చేసింది. ఎలాగూ టీవీ షోలు కూడా చేస్తోంది కాబట్టి.. సీనియర్ హీరోల పక్కన కొన్ని సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. దాంతో ప్రియమణికి మళ్లీ కొంతవరకు డిమాండ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా నారప్పతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అందుకే ఇప్పటికీ అవకాశం వచ్చిన ప్రతి సినిమాలోనూ నటిస్తూ భారీగానే అందుకుంటూ ముందుకు పోతుంది.
అయినా డబ్బు మీద ఆశ మాత్రం ఈ ముదురు భామకు ఇంకా చావట్లేదు. . ‘ఫ్యామిలీ మెన్’తో హిందీ కెరీర్ కు కూడా మళ్ళీ ఊపు వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఆమె మెయిన్ లీడ్ గా ఒక బోల్డ్ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ పేరు ‘హోమ్లీ ఆంటీ’ అట. పేరులోనే అర్థం అవుతుంది. ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియమణి బెంగళూరులోనే సెటిల్ అయింది.