కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఆ పథకాల ద్వారా రిస్క్ లేకుండా లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది. వేర్వేరు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆకర్షణీయమైన రాబడిని పొందవచ్చు. ఈ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను కూడా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి.
ఎవరైతే పీపీఎఫ్ స్కీమ్ లో చేరతరో వాళ్లు 15 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ పై కేంద్రం 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తుండగా ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లలో మార్పులు చేయడం జరుగుతుంది.
కనీసం 500 రూపాయల చొప్పున సంవత్సర కాలంలో లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రతి నెలా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండగా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. నెలకు 5,000 రూపాయలు పీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 16.27 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.
ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే మొత్తం 9 లక్షల రూపాయలు కాగా ఇన్వెస్ట్ చేసే మొత్తానికి పొందే లాభం మాత్రం 7.27 లక్షల రూపాయలుగా ఉండనుంది.