https://oktelugu.com/

Romantic Movie: తన తర్వాత చిత్రం ఆ బ్యానర్ లోనే అంటున్న రొమాంటిక్ మూవీ దర్శకుడు… అనిల్ పాదూరి

Romantic Movie: పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం ” రొమాంటిక్ “. ఈ చిత్రానికి అనిల్ పాదూరి డైరెక్టర్ గా చేస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ దగ్గర అనిల్ పాదూరి అసిస్టెంట్ డైరెక్టర్ గా అనేక సినిమాలకు పని చేశారు. కాగా తన మొదటి సినిమా గా రొమాంటిక్ చిఓత్రమ్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయ్యాడు. అనిల్ రాసే కధలు పూరి జగన్నాద్ కి బాగా నచ్చేవని… ‘ఇజం’ సినిమా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 25, 2021 / 04:00 PM IST
    Follow us on

    Romantic Movie: పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం ” రొమాంటిక్ “. ఈ చిత్రానికి అనిల్ పాదూరి డైరెక్టర్ గా చేస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ దగ్గర అనిల్ పాదూరి అసిస్టెంట్ డైరెక్టర్ గా అనేక సినిమాలకు పని చేశారు. కాగా తన మొదటి సినిమా గా రొమాంటిక్ చిఓత్రమ్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయ్యాడు. అనిల్ రాసే కధలు పూరి జగన్నాద్ కి బాగా నచ్చేవని… ‘ఇజం’ సినిమా సమయంలోనే ఓ కథను డైరెక్ట్ చేయమని పూరి చెప్పారని అంటున్నాడు. ఇటీవల ఈ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు అనిల్.

    యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ తో పురి తెరకెక్కించిన ‘టెంపర్’ సినిమాకి వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారట అనిల్.  ఆ సమయంలోనే నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి అనిల్ ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీను కూడా మొదలు పెట్టారాణి తెలిపారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ లో దర్శకుడిగా పరిచయం కావాలని అనుకున్నానాని తన మనసులోని మాట వెల్లడించాడు. కానీ మొదటి సినిమా తన గురువు తనయుడితో తీయడం ఇంకా సంతోషంగా ఉందని అనిల్ అన్నారు.  ‘రొమాంటిక్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను  ఆకట్టుకునేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే తన తర్వాత సినిమా  చేస్తానని స్పష్టం చేశారు.

    కాగా రొమాంటిక్ సినిమాకి పూరి జగన్నాధ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కథ-మాటలు పూరి గారివే అయినప్పటికీ ఈ సినిమాలో డైరెక్టర్ గా తన  స్టైలే ఉంటుందని చెబుతున్నారు అనిల్. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చని ట్రైలర్ చూసి ఇది యూత్ సినిమా అనుకోవద్దని వివరించారు.