spot_img
Homeఎంటర్టైన్మెంట్అభిమాని పెళ్లి ప్రపోజల్ కి హీరోయిన్ క్రేజీ రిప్లై !

అభిమాని పెళ్లి ప్రపోజల్ కి హీరోయిన్ క్రేజీ రిప్లై !

Priya Bhavaniహీరోయిన్లకు సోషల్ మీడియాలో ప్రపోజ్ చేయడం ఈ మధ్య ఆనవాయితీ అయిపోయింది. ఈ మధ్య నెటిజన్లు తరుచూ ‘నన్ను పెళ్లి చేసుకుంటారా ? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఏమి చేయాలి ? ఇలాంటి కామెంట్స్ తో మొత్తానికి కొత్త ట్రెండ్ కి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు అభిమాన తారలను ఒకసారి చూడాలని ఎన్నో కలలు కనేవారు.

కానీ ఇప్పుడు ఆ తారలతో సెల్ఫీ దిగాలని, మరీ కుదిరితే ఏకంగా ఆమె చేయి పట్టుకుని నడవాలని ఇలా పగటి పూటే కలలు కంటూ మురిసిపోయే వారు కొందరు ఉన్నారు. ఈ పగటికలలు కనేవాళ్లల్లో ఓ నెటిజన్‌, తమిళ హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌ తో వన్ సైడ్ ప్రేమలో పడి మునిగితేలుతున్నాడు. అయితే, అతనికి తన ప్రేమను ఆమెకు చెప్పాలి అనిపించింది.

కానీ ఎలా వ్యక్తం చేయాలి? ఎలా బుట్టలో వేసుకోవాలి? పెళ్లికి ఎలా ఒప్పించాలో అర్థం కాక, గత కొన్ని రోజులుగా తెగ ఫీల్ అయిపోతున్నాడు. మొత్తానికి ఈ ఫీలింగ్ ను ఇక భరించలేక తన సమస్యకు పరిష్కారం సూచించమని ప్రియా భవానీ శంకర్‌ నే సూటిగా ప్రశ్నిస్తూ.. ‘నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే నేనేం చేయాలో చెప్పగలరు’ అంటూ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.

ఈ వినూత్న పోస్ట్ చూసిన ప్రియా భవానీ శంకర్‌ స్పందిస్తూ ‘కొత్తవారికి నేను అర్ధం కాను. నాతో ప్రయాణం కొత్తవారికి కష్టమే. అందుకే నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలన్న విషయం మీకు తెలియకపోవడమే మంచిది, అదే సేఫ్ కూడా’ అంటూ ప్రియా భవానీ బదులిచ్చింది. మొత్తానికి ప్రియాభవానీ శంకర్‌ తెలివిగా సమాధానం ఇచ్చింది.

ఎంతైనా చిన్న న్యూస్‌ రీడర్‌ గా పని చేసిన ప్రియాభవానీ శంకర్‌ కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతూ బుల్లితెర పై పాపులారిటీని తెచ్చుకుని, ఆ తర్వాత వెండితెర వైపు అడుగులు వేసి, పలు తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి పేరు తెచ్చుకుంది. ఇక మంచు మనోజ్‌ సరసన ‘అహం బ్రహ్మాస్మి’లోనూ ప్రియాభవానీ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Priya Bhavani

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Oktelugu Epaper
Exit mobile version