Bigg Boss 7 Telugu: అతి సర్వత్రా వర్జయేత్ అంటారు పెద్దలు. కానీ ఇప్పుడు యావర్ విషయంలో అదే నిజం అనిపిస్తుంది. తెలిసి మాట్లాడుతాడో తెలియక మాట్లాడుతాడో అర్థం అవదు. కానీ ట్రోలర్స్ కి మాత్రం మంచి కంటెంట్ ఇస్తుంటాడు. అందుకే నెట్టింట మీమ్స్‌కు కేరాఫ్గా మారింది ఈయన తీరు. ట్రోలర్స్ గురి ఈయన మీదికి మళ్లింది. దీంతో ఇక ఓ ఆట ఆడేసుకుంటున్నారు. దానికి తోడు ప్రతి సారి ఏదో కంటెంట్ ఇవ్వడం కూడా యావర్ కి కామన్ అయిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు ఏకంగా అమాయకత్వమా? నిజంగానే తెలియదా? లేదా మైండ్ పనిచేస్తలేదా అనే రేంజ్ లో ఇచ్చాడు కంటెంట్…
ప్రిన్స్ యావర్..షో మొదలైతున్నప్పుడే.. నాగ్ ముందు చొక్కా విప్పి మరీ అతి చేశాడు యావర్.. ఆ తీరును.. షోలో ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ప్రతీ చిన్న విషయానికి అగ్రెసివ్ అవ్వడం.. కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిచడం వంటివి నిత్యం కనిపిస్తుంటాయి. కానీ ఆ తరువాత నాగ్ చెప్పే కరెక్షన్స్ కారణంగా.. కాస్త తన యాటిట్యూడ్‌ను తీర్చిదిద్దుకున్నాడు. అనవసర అగ్రెసివ్‌నెస్‌ను తగ్గించి.. గేమ్ మీద ఫోకస్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ ట్రోలర్స్ కంట్లో పడ్డాడు కండల వీరుడు.
శివాజీ ఎండ బాగా కొడుతుంది ఎండ అంటే.. మీ ఎగ్స్ నా దగ్గర ఉంది అన్నాడు ప్రిన్స్. ఏంటయ్యా ప్రిన్స్ ఎండకు అండాకు తేడా తెలియదా? ఇది కూడా తెలియకుండా బిగ్ బాస్ ఇంట్లోకి ఎలా వచ్చావయ్యా సారు అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. అయినా వాతావారణం గురించి తెలియకపోయినా పర్లేదు కానీ మూడు కాలాల గురించి కూడా తెలియదా? అందులో ఎండ, వాన, చలి అనే పదాలకు అర్థం కూడా తెలియదా? ఎండా అంటే అండా అంటావ్ ఏంటి స్వామి అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్.
View this post on Instagram