Rajeev Kanakala- Suma: రాజీవ్ కనకాల సుమ చాలా రోజుల నుంచి సినిమాల్లోనూ, సీరియల్స్ లోనూ నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక సుమ గురించి ప్రత్యేకం గా చెప్పాలంటే యాంకరింగ్ చేయడం లో ఆమెని మించినవారు తెలుగు లో లేరనే చెప్పాలి. ఇప్పుడు వీళ్ల కొడుకు అయినా రోషన్ కనకాల ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ బబుల్ గమ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రోషన్ హీరోగా నటిస్తూ తొలిసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో ఆయన నటన అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే దర్శక నిర్మాతలు అయితే తెలియజేస్తున్నారు. ఇక అందులో భాగంగానే మొన్న సోషల్ మీడియా వేదికగా రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు సినిమా నుంచి ఒక టీజర్ అనేది బయటికి రావడం జరిగింది. నిన్న జరిగిన ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో నాని చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. ఇక ఈ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ లో ఉన్న యూత్ అందరూ ఒకటే అరవడం మొదలుపెట్టారు.ఇక అది చూసిన వాళ్లలో చాలామంది యూత్ ఉండడం వల్ల అలా అరుస్తూ గోల చేశారు.
ఎందుకంటే ఈ టీజర్ మొత్తం బూతు డైలాగులు అలాగే రొమాంటిక్ సీన్స్ తో నిండిపోయింది. ఇలాంటివి యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తాయనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలో టీజర్ చివర్లో హీరో సముద్రం దగ్గర హీరోయిన్ కి లిప్ లాక్ ఇస్తాడు. అది చూసిన యూత్ మొత్తం ఒకటే అరుపులు…ఇక టీజర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత రాజీవ్ కనకాల మాట్లాడుతూ ఈ సినిమాలో మా అబ్బాయి బాగా చేశాడనే నేను కూడా అనుకుంటున్నాను… అని చెప్తూనే టీజర్ చివర్లో మాత్రం అంటూ సాగదీసాడు.
దాంతో అక్కడున్న యూత్ ఒక్కసారిగా అరుస్తూ గోల పెట్టారు.దాంతో పక్కనే ఉన్న సుమ ఇదంతా ఇప్పుడు మాట్లాడవలసింది కాదులే రాజా పద అని అతన్ని ముందుకు తీసుకెళ్ళింది.ఇక సుమ కూడా టీజర్ లోనే ఇంత చూపించారు అంటే సినిమాలో ఇంకెంత చూపిస్తారో ఏంటో అంటూ ఒక కామెంట్ ని వదిలింది. దాంతో అక్కడున్న యూత్ అందరూ మళ్లీ గట్టిగా అరిచారు.
అయితే ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు మాత్రం రాజీవ్ కనకాల సుమ అంటే ఒక డీసెంట్ వ్యక్తులుగా మనందరికీ తెలుసు… అలాంటిది వాళ్ల అబ్బాయిని ఇలాంటి ఒక మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ వాళ్ళు సైతం వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం సినిమా హిట్ అవ్వాలంటే అందులో బూతు డైలాగులు ఉండాలి అలాగే రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువగా ఉంటేనే సినిమా ఆడుతుందని చాలామంది చెప్తున్నారు.అందుకు ఉదాహరణ గా బేబీ, మాడ్ లాంటి సినిమాలను చూపిస్తున్నారు…అందుకే ఈ సినిమాలో కూడా ఎక్కువ గా అడల్ట్ సీన్స్ పెట్టినట్టు గా తెలుస్తుంది.