Game Changer : ఒక సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చి, జనాలు ఇరగబడి చూసిన తర్వాత, ఆ వెంటనే విడుదలయ్యే చిత్రం పై కచ్చితంగా భారీ ప్రభావం పడుతుంది. ఎందుకంటే వందల రూపాయిలు ఒక సినిమాకి ఖర్చు చేసి, మరో సినిమాకి మళ్లీ డబ్బులు భారీ గా ఖర్చు చేయడానికి ఏ ప్రేక్షకుడు ఆసక్తి చూపించడు. డిసెంబర్ నెలలో ‘పుష్ప 2’ చిత్రం విడుదలై ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికీ తెల్సిందే. సుమారుగా దేశవ్యాప్తంగా ఈ సినిమా ఆరు కోట్ల మంది థియేటర్స్ లో చూసారు. చూసిన ఆడియన్స్ మళ్లీ రిపీట్స్ లో థియేటర్స్ లోకి వచ్చి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఈ చిత్రం కోసం జనాలు విచ్చలవిడిగా ఖర్చు చేసారు. ఈ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల కాబోతుంది.
మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై పుష్ప 2 ప్రభావం ఒక రెండు ముఖ్యమైన ప్రాంతాల్లో పడిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఆ రెండు ప్రాంతాల్లో ఒకటి ఓవర్సీస్. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ‘గేమ్ చేంజర్’ పై పుష్ప ప్రభావం చాలా గట్టిగానే ఉంది. ఈ ప్రాంతం లో పుష్ప 2 చిత్రం 15 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ చిత్రాన్ని ఒక్కొక్కరు 30 డాలర్లకు పైగా వెచ్చించి థియేటర్స్ లో చూసారు. ‘గేమ్ చేంజర్’ చిత్రం టికెట్ రేట్ కూడా అదే రేంజ్ లో ఉంది. మళ్లీ ఆ రేంజ్ లో ఈ సినిమాకి పెట్టి చూడాలంటే అభిమానులు అయితే కచ్చితంగా చూస్తారు, మామూలు ఆడియన్స్ మాత్రం మళ్లీ అంత డబ్బులు పెట్టడానికి ఆలోచిస్తారు. నిన్న విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ప్రస్తుతానికి నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ బాగా పెరిగాయి.
కానీ ‘పుష్ప 2’ , ‘దేవర’ రేంజ్ లో 2.8 మిలియన్ డాలర్లు ప్రీమియర్స్ నుండి రావడం కష్టం. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఈ సినిమాకి కేవలం 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయట. అంటే దాదాపుగా 1.3 మిలియన్ డాలర్ల నష్టం పుష్ప 2 కారణంగా గేమ్ చేంజర్ పై పడింది. నైజాం మార్కెట్ పై కూడా పుష్ప ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని బయ్యర్స్ కాస్త భయపడుతున్నారు. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఈ ఆదివారం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఆంధ్ర ప్రదేశ్ లో చేయనున్నారు. రేపు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి లో భారీ లెవెల్ లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.