Prem Rakshith And Prabhas: బాహుబలి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించిన నటుడు ప్రభాస్… ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడనే చెప్పాలి…అలాంటి ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా మీద ఇండియన్ ప్రేక్షకులందరు భారీ ఆశలైతే పెట్టుకుంటున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన రాజాసాబ్ సినిమాతో మరోసారి ప్రభాస్ తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి అది వర్కౌట్ కాలేదు… రిజల్ట్ తేడా కొట్టడంతో ఆయన చాలావరకు డిసప్పాయింట్ అయ్యాడు. ఇక దాంతో రెండు రోజుల్లో రాజాసాబ్ సినిమాకి భారీగా నెగెటివిటి వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ తన తదుపరి సినిమా విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలని చూస్తున్నాడు. ఇక తనకు అంత పెద్దగా కాన్ఫిడెంట్ లేని సినిమాలను రిజెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
గతంలో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. ప్రభాస్ కూడా ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి రాజాసాబ్ సినిమా రిజల్ట్స్ చూసిన తర్వాత తన డిసిజన్ మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రేమ్ రక్షిత్ సినిమాకి నో చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్ ఎలా చేస్తాడో తెలియదు అతని స్టైల్ ఏంటో కూడా ఎవరికి ఇప్పటివరకు క్లారిటీ లేదు. సాంగ్స్ ని బాగా కొరియోగ్రఫీ చేయగలిగే అతను సినిమాని ఎలా డీల్ చేస్తాడు. ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేయగలుగుతాడు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి తను ఒక రెండు సినిమాలు చేసిన తర్వాత అతని స్టైల్ బాగుంటే ఆయనతో సినిమా చేస్తానని ప్రభాస్ చెప్పాడట…
ఇక మొహమాటలకు పోయి సినిమాలు చేయడం మానేస్తే మంచిదని అతని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. హను రాఘవ పూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తే మరోసారి తన మార్కెట్ ను పెంచుకున్న వాడవుతాడు. లేకపోతే మాత్రం చాలా వరకు వెనుకబడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…