Anil Ravipudi And Nagarjuna: ప్రస్తుతం ఉన్న కమర్షియల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన వరుస సక్సెస్లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన ఎన్ని విజయాలను సాధించినా కూడా ఆయన మీద నెగెటివిటి అంతకంటే ఎక్కువగా పెరిగిపోతుంది. కారణం ఏంటి అంటే ఆయన సినిమాల్లో హీరోలు మారుతారు కానీ కథలు మారవు…ఒకే ఒకతను అటు ఇటు చేసి చెబుతాడు. అతనితో సినిమాలు చేస్తున్న హీరోల అభిమానులు సైతం తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు రొటీన్ ఫార్మాట్ లోనే ముందుకు సాగుతారని ఒక్కసారి కూడా ఎక్స్పరిమెంట్ చేసే పరిస్థితి లేదని దాని వల్లే అతని సినిమాలను చూడడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించారని చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ లేకపోతే అనిల్ రావిపూడి సినిమాలు అసలు నడవవని కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు.
ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సినిమాలను చేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు నాగార్జునతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున తో ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా సినిమాలు చేయలేదు.
కాబట్టి ఆ ఘనతను సాధించిన మొదటి దర్శకుడు తనే అవుతానని కూడా చెబుతున్నాడు… నాగార్జునతో సినిమా చేస్తే పోలీస్ ఆఫీసర్ గెటప్ లో నాగార్జునను చూపించే ప్రయత్నం చేస్తాడు. దానికి కూడా ఒక ఫ్యామిలీని ఆడ్ చేసి ఆయన తన ఫ్యామిలీతో ఎలా సఫర్ అవుతున్నాడు. తన డ్యూటీ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అనే ఒక కమర్షియల్ కథతోనే అనిల్ రావిపూడి సినిమా చేస్తాడు.
అంతకుమించి గొప్పగా అతని నుంచి మనం సినిమాలను ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కూడా లేవు… నిజానికి నాగార్జునకి సినిమాల సెలక్షన్ మీద చాలా అవగాహన ఉంది. ఆయన రొటీన్ సినిమాలను ఎప్పుడు ఇష్టపడడు. ఎప్పటికప్పుడు కొత్త జానర్లో సినిమాలను తెరకెక్కించే దర్శకులను మాత్రమే ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇక అలాంటి నాగార్జున అనిల్ రావిపూడి కి అవకాశం ఇస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…