సాధారణం గా ఒక మోస్తరుగా ఉండే చిన్న సినిమాలను థియేటర్లలోనే కాదు, ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో పెట్టినా ప్రేక్షకులు చూడరు. ఫ్రీగా చూడ్డానికి కూడా తెగ బాధపడి పోతుంటారు. కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన చిన్న సినిమా నిర్మాతలు ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు . తమ సినిమాలకి బుల్లితెర ఫై , ఓ టి టి ప్లాటుఫారం లలో దక్కుతున్న ఆదరణ చూసి ఆశ్చర్య పోతున్నారు.
కొందరైతే తమ చిన్న సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా డైరెక్ట్ గా ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో పెట్టేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. రీసెంట్ టైములో వచ్చిన ` ఓ పిట్ట కథ `,` రాజావారు రాణిగారు `, `హిట్ `వంటి చిత్రాలను నెట్ లో ఎక్కువమంది చూసారు. ఇంకా చూస్తున్నారు కూడా …
గత కొంత కాలంగా విజయాలకు దూరమై హీరోల కేసులో కొంచెం వెనుకపడ్డ మెగా మేనల్లుడు సాయి (ధరమ్) తేజ్ ` ప్రతిరోజూ పండగే ` చిత్రంతో భారీ హిట్ అందుకున్నాడు. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన `ప్రతిరోజూ పండగే ` చిత్రం సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది కాగా ఇటీవల` స్టార్ మా` ఛానల్ లో ఈ చిత్రం ప్రసారంకాగా భారీ టీఆర్పీ దక్కించు కొంది. ఈ చిత్రానికి ఏకంగా 15.3 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. అలా ఈ మధ్య కాలంలో మంచి టిఆర్పి సాధించిన చిత్రంగా `ప్రతిరోజూ పండగే `నిలిచింది. every dog has it’s own day
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Prati roju pandage scores highest trp in sai dharam tejs career
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com