Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఏ ఆపద వచ్చినా కూడా తను వెళ్లి ఆదుకుంటాడనే ధోరణిలో చాలామందికి ఉంది. మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం మీద మంచి అభిప్రాయమైతే ఉంది. ఇక మోహన్ బాబు చిరంజీవి ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి కెరియర్ ని స్టార్ట్ చేసినప్పటికి చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా మారి అక్కడి నుంచి మెగాస్టార్ గా మారితే మోహన్ బాబు మాత్రం విలన్ గా చేస్తూనే హీరోగా మారి కొన్ని సినిమాలు చేసి సరైన సక్సెస్ అందుకోలేక డీలాపడిపోయాడు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య తరచూ విభేదాలు అయితే వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మళ్ళీ ఎప్పటికప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అంటూ నిరూపించుకునే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు కి కొద్దివరకు ఆపదైతే ఎదురైంది. కాబట్టి చిరంజీవి అతనికి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఫోన్ లోనే మోహన్ బాబు కొంతవరకు ఎమోషనల్ అయినట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ స్టార్ హీరోలు ఇద్దరు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముందుకు సాగారు. మరి అలాంటి మోహన్ బాబు కి ఇప్పుడు కష్టం రావడం అనేది నిజంగా చాలావరకు బ్యాడ్ విషయమనే చెప్పాలి.
మరి ఈ సందర్భంలో ఆయన తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ చిరంజీవి మోహన్ బాబు కి ఫోన్ చేసి మాట్లాడి అతన్ని ఓదార్చడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఈ విషయంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చి వీళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబుకి చిరంజీవి మాట్లాడితే అదొక బలం అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అందుకే చిరంజీవి ఫోన్ చేయడంతో మోహన్ బాబుకి ఎక్కడలేని ప్రాణం వచ్చినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి మోహన్ బాబు అనే వాళ్ళు టామ్ అండ్ జెర్రీ లాంటి వారు ఎప్పుడూ గొడవ పడతారో ఎప్పుడు కలిసి ఉంటారో ఎవ్వరికి తెలియదని చిరంజీవి ఒక సందర్భంలో తెలియజేయడం విశేషం… ఏది ఏమైనా కూడా వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అనేది ఇలా బయటపడుతూనే ఉంటుంది. మొత్తానికైతే వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్ లుగా ఒక వెలుగు వెలగడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి…