Prashanth Varma , Mokshagna
Prashanth Varma and Mokshagna : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ నట వారసులను ఇండస్ట్రీకి తీసుకొచ్చి వరుస సక్సెస్ లను సాధించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక తండ్రి కొడుకులు సైతం వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి వార్తలైతే వస్తున్నాయి కానీ అవి కార్య రూపం దాల్చడం లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు (Balayya Babu) లాంటి సీనియర్ హీరో సైతం వరుస సినిమాలను చేస్తూ ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు… ఇక తన కొడుకు అయిన మోక్షజ్ఞ(Mokshagna) కూడా ఈ సంవత్సరం మొదటి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ ఈ సంవత్సరంలో ఆల్రెడీ మూడు నెలలు గడిచిపోయాయి. ఇప్పటివరకు ఆ సినిమా అయితే స్టార్ట్ అవ్వలేదు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని మీద కూడా సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. ఇక ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలను కూడా స్టార్ట్ చేసుకున్నాడు. తద్వారా ఆయన ఈ సినిమాని ఎప్పుడు సెట్ మీదకి తీసుకెళ్తాడు, ఎప్పుడు సినిమాని ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాడు అనే దాని మీద కూడా క్లారిటీ అయితే లేదు.
Also Read : ప్రశాంత్ వర్మ – బాలయ్య ల మధ్య డిస్కషన్స్ ఇక ముగిసిపోలేదా..?
మరి ఎందుకోసం ఈ ప్రాజెక్టు లేట్ అవుతుంది. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేస్తే బాధ్యతలను సిన్సియర్ గా తీసుకున్నాడా? లేదంటే లైట్ తీసుకున్నాడా? వీళ్ళ ప్రాజెక్టు అసలు పట్టాలు ఎక్కుతుందా లేదంటే క్యాన్సల్ అవుతుందా? అనేదానిమీద సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటికే నందమూరి అభిమానులు సైతం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎప్పటికప్పుడు బాలయ్య బాబు ఈ సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇలాగే చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఆయన ఎంట్రీ అయితే ఇవ్వలేదు. మరి ఈ సినిమా ఉంటుందా ఉండదా మోక్షజ్ఞ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా కావాలనే బాలయ్య బాబు అతన్ని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలని చూస్తున్నాడు అనే అనేక విషయాల మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. మరి మొత్తానికి అయితే ఈ సంవత్సరంలో ఆయన సినిమాను స్టార్ట్ చేసి కనీసం వచ్చే సంవత్సరం అయినా రిలీజ్ చేస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఇప్పటికే నట వారసులంతా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లను సాధిస్తూ దూసుకుపోతుంటే బాలయ్య బాబు కొడుకు మాత్రం ఇంకా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి అనే దానికోసమే ఎదురు చూస్తూ ఉండడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. ఇక నందమూరి అభిమానులైతే అతని రాక కోసం వేయికన్నులతో ఎదురుచూస్తున్నారు. మరి ఆయన ఎప్పుడూ వస్తాడు సినిమా ఎప్పుడు చేస్తాడు, ఇండస్ట్రీ హిట్ ఎప్పుడు కొడతాడు అనే దాని మీదనే ఎప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది…
Also Read : మోక్షజ్ఞకు హ్యాండ్ ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ, స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీకి సిద్ధం!