Prashanth Varma , Mokshajna
Prashanth Varma and Mokshajna : నందమూరి నట సింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ. ఒక్క సినిమా కూడా చేయలేదు. వయసు మూడు పదులు దాటేసింది. బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్ మోక్షజ్ఞ టీనేజ్ లో ఉన్నప్పటి నుండే జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. బాలయ్య సినిమాల ఫ్లెక్సీలలో మోక్షజ్ఞ ఫోటో కూడా ఉండేలా చూసుకుంటున్నారు. ఆ విధంగా బాలయ్యపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ హీరో కావడం మోక్షజ్ఞకు ఇష్టం లేదనే వాదన ఉంది. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అయ్యిందని అంటారు. ఎట్టకేలకు మోక్షజ్ఞ మనసు మార్చిన బాలకృష్ణ ప్రకటన చేశారు.
హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ చేతిలో మోక్షజ్ఞ లాంఛింగ్ మూవీ పెట్టాడు. కథ కూడా సిద్ధమైంది. మోక్షజ్ఞ లుక్ రివీల్ చేస్తూ ఒక పోస్టర్ కూడా వదిలారు. గత ఏడాది చివర్లో భారీగా పూజా కార్యక్రమానికి ముహూర్తం పెట్టారు. దాదాపు రూ. 30 లక్షలు ఖర్చు చేసి సెట్స్ కూడా వేశారని సమాచారం. చివరి నిమిషంలో పూజా కార్యక్రమం ఆగిపోయింది. మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీకి సమస్యలు అంటూ కథనాలు వెలువడ్డాయి. మోక్షజ్ఞ టీం ఈ పుకార్లను కొట్టిపారేసింది.
నెలలు గడుస్తున్నా మరో ప్రకటన లేదు. ప్రశాంత్ వర్మ-బాలయ్య మధ్య విబేధాలు తలెత్తాయి. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తో మూవీ చేయడం లేదనే పుకార్లను నిజం చేసేలా పరిణామాలు తయారయ్యాయి. తాజాగా పరిశ్రమలో మరో పుకార్లు షికారు చేస్తుంది. మోక్షజ్ఞ మూవీ పక్కన పెట్టేసిన ప్రశాంత్ వర్మ ఏకంగా ప్రభాస్ తో మూవీకి రెడీ అవుతున్నాడట. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడట.
ఈ ప్రాజెక్ట్ ని ప్రభాస్ కూడా ఓకే చేశాడట. కెజిఎఫ్ నిర్మాతలైన హోమ్బలే ఫిలిమ్స్ ప్రభాస్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారట. ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ మూవీ దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. ఈ క్రమంలో బాలకృష్ణ వేరే దర్శకుడిని మోక్షజ్ఞ కోసం వెతికే పనిలో ఉన్నాడట. ఇది బాలయ్య అభిమానులను నిరాశపరిచి వార్తే. మోక్షజ్ఞ ఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. మరోవైపు బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన అఖండ 2 చేస్తున్నారు.