https://oktelugu.com/

Prashanth Varma : ప్రశాంత్ వర్మ ను ముంచిన ఓవర్ కాన్ఫిడెంట్…ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్లే ఆయన బాలయ్య చేతిలో తిట్లు తిన్నాడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు..

Written By:
  • Gopi
  • , Updated On : December 20, 2024 / 09:39 AM IST

    Prashanth Varma

    Follow us on

    Prashanth Varma : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు… అయితే దర్శకులు సైతం ఈ విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ నటులను స్టార్ హీరోలుగా మార్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు…

    ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ…ఆయన చేసిన ‘హనుమాన్ ‘ సినిమా యావత్ ఇండియన్ ప్రేక్షకులందరిలో ఒక సెపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసింది. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు విజువల్ వండర్స్ ని క్రియేట్ చేస్తే ఇక ప్రశాంత్ వర్మ సైతం చాలా తక్కువ బడ్జెట్ లోనే బెస్ట్ ఔట్ పుట్ ను తీసుకువచ్చి సూపర్ సక్సెస్ గా నిలపాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అయింది. ఇక దానికి తగ్గట్టుగానే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞను కూడా ప్రశాంత్ వర్మ చేతిల మీదుగానే ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వచ్చాయి. ఇక దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ వర్మ కూడా మోక్షజ్ఞ ను ఏ రేంజ్ లో చూపించాలి అనే దానిమీద తీవ్రమైన కసరత్తులు చేసి ఒక మంచి కథను కూడా రెడీ చేశాడు. ఇక ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కబోతుంది అంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మ తన దగ్గర 33 కథలు ఉన్నాయని చెబుతూ తనే ఒక ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి అందులో ప్రశాంత్ యూనివర్స్ కి సంభందించిన సినిమాలను చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తనే ఒక సపరేట్ ఇండస్ట్రీని క్రియేట్ చేయాలనే భ్రమలో ప్రశాంత్ వర్మ ఉన్నాడు. అందువల్ల ఆయన లో ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయి తనకోసం ఏ హీరో అయినా వెయిట్ చేస్తాడు. ఎవరితో అయినా సినిమా చేసే కెపాసిటీ నా దగ్గర ఉందని అనుకుంటున్నాడు.

    కాబట్టి తనకు సినిమా ఇండస్ట్రీలో కొంతవరకు గడ్డు పరిస్థితి ఆయితే ఏర్పడుతుంది…ఇక బాలయ్య మోక్షజ్ఞ సినిమా గురించి అడిగితే కూడా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో సమాధానం చెప్పారట. ఇక దాంతో బాలయ్య బాబు కి కోపం వచ్చి ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు క్యాన్సిల్ చేశారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇక దీనికోసం మిగిలిన కొంతమంది దర్శకులతో బాలయ్య బాబు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు జేజేతులారా తనే ఆ ప్రాజెక్ట్ ను క్యాన్సల్ చేసుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…

    ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబుతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. కాబట్టి ప్రశాంత్ వర్మ ను మార్చేసి అతని ప్లేస్ లో నాగ్ అశ్విన్ ను గాని, లేదంటే ఇంకా వేరే దర్శకులను గాని తీసుకురావాలనే ఆలోచనలో బాలయ్య బాబు తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నాడు…