https://oktelugu.com/

Prashanth Neel: జూనియర్ ఎన్టీయార్ విషయం లో అసంతృప్తి తో ఉన్న ప్రశాంత్ నీల్…కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తూ ఉంటారు. ఇక అందులో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతారు. తన డాన్సులతో, తన నటనతో ప్రేక్షకులందరిని మెప్పించడం లో ఆయన మొదటి స్థానంలో ఉంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 28, 2024 / 10:42 AM IST

    Prashanth Neel NTR movie title

    Follow us on

    Prashanth Neel: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన మొదటి సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా వరకు ప్రతి సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా ఆయన నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఆ ఫ్యామిలీ బాధ్యతలు ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా వరకు కృషి చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…పాన్ ఇండియాలో దేవర సినిమాతో 500 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల పైన కూడా భారీగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో వార్ 2 సినిమాతో మరోసారి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. దాంతోపాటుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే సినిమా కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్టీఆర్ విషయంలో కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దేవర సినిమాతో పాన్ ఇండియాలో ఎన్టీయార్ కేవలం అయిన 500 కోట్ల వరకు కలెక్షన్స్ మాత్రమే రాబట్టాడు.

    తనకు భారీగా మార్కెట్ లేదని తను చేసే సినిమా వల్ల ఎన్టీయార్ కి హెల్ప్ అవుతుంది తప్ప ఎన్టీఆర్ వల్ల ప్రశాంత్ నీల్ కి ఏ హెల్ప్ అవ్వదని తన భావిస్తున్నాడట. నిజానికి ఒక్కరికి వల్ల ఒకరికి హెల్ప్ అవుతుంది అనుకుంటేనే డైరెక్టర్లు గాని, హీరోలు గాని వాళ్లతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు.

    కానీ ఇక్కడ ఎన్టీఆర్ క్రేజ్ కంటే ప్రశాంత్ నీల్ క్రేజే పాన్ ఇండియాలో ఎక్కువగా ఉందనే విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అందువల్ల ప్రశాంత్ నీల్ కొంతవరకు సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సక్సెస్ ని అందిస్తానని చాలా కాన్ఫరెన్స్ వ్యక్తం చేస్తున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం కొంతవరకు అసంతృప్తి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడట. చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళిద్దరూ ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తారు అనేది…

    ఇక ఇంతకుముందు ప్రశాంత్ నీల్ చేసిన కేజిఎఫ్ సిరీస్, సలార్ సినిమాలు భారీ సక్సెస్ లను సాధించాయి. సలార్ 800 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడితే కేజిఎఫ్ 2 1200 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమాతో 1500 కోట్ల కలెక్షన్స్ ను టార్గెట్ గా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…