Vijay: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన సినిమాలతో సాధించుకున్న క్రేజ్ కంటే ఆయన వ్యక్తిత్వం ద్వారా అతనికి అభిమానులు అయిన వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అయిన నిజాయితీగా ఉంటాడనే ఉద్దేశ్యంతో అభిమానులు ఆయనకు దాసోహం అవుతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దళపతి విజయ్ కి కూడా చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన కూడా అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. దాదాపు రజనీకాంత్ తర్వాత మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో తను మొదటి స్థానంలో ఉంటాడు. ఏది ఏమైనా కూడా ఆయన కూడా ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ‘తమిళగా వెత్రి కజగం’ అనే పొలిటికల్ పార్టీని పెట్టి రాజకీయ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంక దానికి సంబంధించిన సభను కూడా నిన్న ఏర్పాటు చేశారు. అందులో భారీగా జనాలు పాల్గొన్నారు. తను మాట్లాడిన కొన్ని మాటలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ‘తను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నీచంగా చూశారని అయినప్పటికీ తను అన్నింటిని ఓర్చుకొని మరి అక్కడ ఎదిగి చూపించానని ఇప్పుడు కూడా రాజకీయాల్లో తను అదే వైఖరితో ముందుకెళ్లాలని చూస్తున్నట్టుగా’ తెలియజేశాడు.
ఇక మొత్తానికైతే దళపతి విజయ్ రాజకీయ పార్టీ పైన చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. మరి తను రాజకీయాల్లో సక్సెస్ అవుతాడా? లేదా అనే విషయం తెలియాలంటే ఎలక్షన్స్ జరిగేంత వరకు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇదిలా ఉంటే మరి కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ తో విజయ్ ను పోలుస్తూ వీళ్ళిద్దరికి సమానమైన క్రేజ్ ఉంది. ఇక కొంచెం లేట్ అయిన కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఇచ్చాడని ఒక్కసారిగా డిప్యూటీ సీఎం గా తను మారడం అనేది చాలా గొప్ప విషయం అంటూ మాట్లాడుతూనే విజయ్ కూడా ఈసారి గెలిచిన, గెలవకపోయినా మరోసారి మాత్రం తను సీఎంగా బరిలో నిలుస్తాడు అంటూ కామెంట్లైతే చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ రాజకీయంగా ఉన్న పలుకుబడి గాని వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. మరి విజయ్ ఆ స్టాండర్డ్ లో ముందుకు దూసుకెళ్తాడా? తమిళనాడు రాజకీయ చదరంగం లో నిలబడగలుగుతాడా అనేది తెలియాల్సి ఉంది…