Prashanth Neel: సినిమా సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ చాలా బిజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలను చూసుకుంటే ఆయన కేజీఎఫ్,సలార్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయం సాధించాలనే ఉద్దేశ్యం తో వరుసగా ఆయన చేసే సినిమాల మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.
అందులో భాగంగా ప్రశాంత్ నీల్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అదే హార్డ్ వర్క్ ని సలార్ సినిమా మీద కూడా పెట్టాడు దాంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు మెగా అభిమానులు అందరూ కూడా రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు.కానీ ప్రశాంత్ నీల్ కు ఇప్పుడున్న కమిట్ మెంట్ల వల్ల చాలా సినిమాలు చేయాల్సి ఉండి ముందుగా ఎన్టీయార్ తో ఒక సినిమా,ఆ తర్వాత కేజీఎఫ్ 3, సలార్ 2 సినిమాలు చేయాలి. ఇక ఇవన్నీ పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.
కానీ ఇవన్నీ పూర్తి కావాలంటే మాత్రం ఈజీగా ఒక 4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. మరి ఇదిలా ఉంటే రామ్ చరణ్ అభిమానులు మాత్రం ప్రశాంత్ నీల్ మీద ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ ని సలార్ లో ఆ రెంజ్ లు చూపించిన ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ కనీసం కెరియర్ లో ఒక్కసారైనా ఒక సినిమా అయిన చేయాలి ఎందుకంటే ప్రశాంత్ నీల్ లాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ ని వదులుకుంటే హీరోలు వాళ్లకు వాళ్ళు చాలా వరకు కోల్పోతారు అంటూ సోషల్ మీడియా లో చాలా కామెంట్లు చేస్తున్నారు.
ఇక నిజానికి ప్రశాంత్ నీల్ కూడా చాలా మంచి డైరెక్టర్ ఆయనకంటూ ఒక టేస్ట్ అనేది ఉంది కాబట్టే ఆయన ఏ సినిమా చేసిన కూడా తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మిస్ అవ్వకుండా చేస్తున్నాడు. అందుకే ప్రశాంత్ నీల్ మీద ప్రతి ప్రేక్షకుడు కూడా ప్రశంసల వర్షాన్ని కల్పిస్తున్నారు. ఇక మరి రాంచరణ్ తో ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందో చూడాలి. అందులో భాగంగానే సలార్ సినిమా సూపర్ గా ఉందని రీసెంట్ గా చిరంజీవి కూడా ఒక ట్వీట్ చేయడం విశేషం…