Prashanth Neel and Ram Charan : కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కేజీఎఫ్(KGF) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేసిన కేజీఎఫ్ రెండు పార్ట్స్ కూడా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ఒక్కసారిగా ఆయన పేరు ఇండియా వైడ్ గా మారుమ్రోగిపోయింది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనాలను క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాతో మరోసారి భారీ రికార్డులను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన సలార్ 2(Salaar 2) సినిమాను చేసి ఆ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన రామ్ చరణ్ తో సుభాష్ చంద్రబోస్ బయోపిక్ ని తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక లేదు అంటే ఒక పీడిత ప్రాంతానికి సంబంధించిన ఫిక్షనల్ స్టోరీని మరోసారి తెరకెక్కించి సూపర్ సక్సెస్ ను సాధించబోయే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతానికైతే రామ్ చరణ్ కి ఈ రెండు కథలను చెప్పి పెట్టారట. వీటిలో ఏది ఫైనల్ అయితే ఆ కథతో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో క్రికెటర్ ధోని నటిస్తున్నాడా..?
మరి ఏదిఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడితో సినిమా చేయడానికి ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన మాత్రం వరుసగా తెలుగు హీరోలనే ఎంచుకొని ముందుకు సాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలో మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే సినిమాలను చేస్తున్న ఆయన ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.
గతంలో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయాలని అనుకున్నప్పటికి వాళ్లు అతనితో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదట. దాంతో ఆయన తెలుగు హీరోల వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం వాళ్లు సైతం అతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికి ఇప్పుడు ప్రశాంత్ నీల్ వాళ్ళని రిజెక్ట్ చేస్తూ ఉండటం విశేషం.
Also Read : నాకు నెట్ ఫ్లిక్స్ మాత్రమే కావాలంటున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..అభిమానులకు చేదువార్త!