NTR and Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నుంచి కూడా వినూత్నమైన రీతిలో తన నటనను చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ తన డాన్సులతో ప్రతి ఒక్కరిని కట్టి పడేస్తూ నటుడిగా ఎదగడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది గొప్ప నటుల్లో తను కూడా ఒకడిగా నిలిచాడు. ఎలాంటి డైలాగులునైనా సరే అలవోకగా సింగిల్ టేక్ లో చెప్పగలిగే కెపాసిటీ ఉన్న ఈ హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను సాధించాలని చూస్తున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశాలైతే చాలానే వచ్చాయి. కానీ వాటిని ఆయన సద్వినియోగం చేసుకోలేదనే చెప్పాలి. కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో మంచి సినిమాలు మొదట ఈయన దగ్గరకే వచ్చాయి. కానీ వాటిని ఆయన వదిలేసాడు. దాంతో ఆ సినిమాలను వేరే హీరోలు చేసి సూపర్ సక్సెస్ లను సాధించారు.
Also Read : ఎన్టీఆర్ తప్పించుకున్నాడు..అల్లు అర్జున్ దొరికేసాడు..ఇద్దరి కెరీర్స్ ని మలుపు తిప్పిన అట్టర్ ఫ్లాప్ సినిమా!
ఇక అల్లు అర్జున్(Allu Arjun) లాంటి నటుడు సైతం ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR) ని బీట్ చేసి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాని అల్లు అర్జున్ చేసి సూపర్ సక్సెస్ ను సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బోయపాటి శ్రీను (Biyapati Srinu) దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన సరైనోడు (Sarainodu) సినిమా కథని మొదట ఎన్టీఆర్ కి వినిపించారట.
కానీ ఆ కథ మీద పెద్దగా ఆసక్తి లేని ఎన్టీఆర్ దాన్ని పక్కన పెట్టేసాడు. ఇక అంతకుముందే వీళ్ళ కాంబినేషన్ లో దమ్ము (Dhammu) అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో వీళ్ళ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలైతే లేకుండా పోయాయి. దానివల్లే జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునే కెపాసిటీ ఉన్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.
అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 (Pushpa 2) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ కి మధ్య ఇప్పుడు సినిమాల పరంగా భారీ పోటీ అయితే ఉంది. మరి వీళ్ళిద్దరి పోటీలో ఎవరు విజయం సాధిస్తారు ఎవరు ఎవరిని బీట్ చేసి ముందుకు సాగుతారు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ఎన్టీయార్, అల్లు అర్జున్ లలో ఎవరు బెస్ట్..?