Prashanth Neel-NTR: మరోసారి వైరల్ అవుతున్న ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ మూవీ టైటిల్… ఉరమాస్ టైటిల్ అంతే…

ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సినిమాకి సంబంధించిన టైటిల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Written By: Gopi, Updated On : May 17, 2024 2:23 pm

Prashanth Neel NTR movie title

Follow us on

Prashanth Neel-NTR: తెలుగు సినిమా ఇండస్ట్రిని పాన్ ఇండియా స్థాయికి చేర్చిన దర్శకుడు రాజమౌళి.. ఇక రాజమౌళి తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లోకి దూసుకు వచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్..నిజానికి ప్రశాంత్ నీల్ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియాలో చాలా అద్భుతాలను క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఆయన చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.

ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక వీళ్ళ కాంబో లో వచ్చే సినిమా టైటిల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ ముందే మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నాడు అంటే ఇక ఆయనకు మాస్ ఇమేజ్ అనేది భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయంటూ ప్రతి ఒక్క అభిమాని కూడా వీళ్ల కాంబినేషన్ లో వచ్చే సినిమా మీద భారీ అంచనాలను అయితే పెట్టుకున్నారు.

ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సినిమాకి సంబంధించిన టైటిల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కథలను మాత్రమే పవర్ ఫుల్ గా రాసుకోకుండా వాటికి టైటిల్స్ ను కూడా చాలా పవర్ ఫుల్ గా పెట్టడంలో ప్రశాంత్ నీల్ ను మించిన దర్శకుడు మరొకరు లేరనే చెప్పాలి. ఇంకా ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం ‘రుద్ర’, ‘డ్రాగన్ ‘ అనే టైటిల్స్ ని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇందులో ఏ టైటిల్ అయితే ఆ సినిమాకి యాప్ట్ అవుతుందో దాన్ని బట్టి ఆయన ఈ సినిమాకి టైటిల్స్ ని పెట్టాలని ఫిక్స్ అయ్యారు. నిజానికి ఈ రెండు టైటిల్స్ కూడా సినిమాకి రిలేటెడ్ గా ఉన్న టైటిల్సే కావడం విశేషం.. అందువల్లే ఈ రెండిటిని పరిశీలించి దేనికి ఎక్కువ పాపులారీటి దక్కితే దానిని సినిమా టైటిల్ గా పెట్టేద్దామనే ఉద్దేశ్యం లో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తుంది…